షావోమి రెడ్మి నోట్ 7 ప్రో ఫ్లాష్ సేల్ : ఈ మధ్యాహ్నం 12 గంటలకి
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదట సేల్ కేవలం 2 నిముషాల లోపే ముగిసింది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి రెండవ ఫ్లాష్ సేల్ జరగనుంది. అయితే, మార్చి 13 వ తేదీన జరిగిన మొదటి ఫ్లాష్ సేల్ కేవలం 2 నిముషాల లోపే ముగిసింది. అంటే, మొత్తం రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు అన్ని కూడా అమ్ముడయ్యాయి. కాబట్టి, రోజు కొనడానికి సిద్ధంగా వున్నవారు 11:45 నుండి వారి వివరాలన్నీ నమోదుచేసుకోనీ సిద్ధంగా ఉండాలి.
Surveyఈ రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోనులో అందించిన ప్రధాన కెమేరా అయినటువంటి 48MP మరియు స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ ప్రత్యేకతలు మరియు ఇవన్నీకూడా కేవలం మధ్య స్థాయిలో లభించడం వంటివి ఈ ఫోనుకు ఇంతగా క్రేజును తీసుకువచ్చింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క తరువాతి ఫ్లాష్ సేల్, మార్చి 20 వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించనుంది.
రెడ్మి నోట్ 7 ప్రో ధర
2. రెడ్మి నోట్ 7 ప్రో – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999
3. రెడ్మి నోట్ 7 ప్రో – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999
రెడ్మి నోట్ 7 ప్రో ప్రత్యేకతలు
ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది. ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్, పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది. ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ 48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.
ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది. ఇందులో అతితక్కువ 1.6um 4-ఇన్-1 సూపర్ పిక్సెల్స్ తో అద్భుతంగా ఉంటుంది, ఈ కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని కంపనీ చెబుతోంది. ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణంతో ఉంటాయి, సామాన్యంగా ప్రస్తుత ఫోనులో ఇది కేవలం 4MB నుండి 6MB మధ్య ఉంటుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.