రెడ్మి నోట్ 7 & రెడ్మి నోట్ 7 ప్రో తరువాతి ఫ్లాష్ సేల్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి

HIGHLIGHTS

ఈ రోజు జరిగిన ఫ్లాష్ సేల్లో కేవలం 2 నిముషాల్లోనే అన్ని ఫోన్లు అమ్ముడయ్యాయి.

రెడ్మి నోట్ 7 & రెడ్మి నోట్ 7 ప్రో తరువాతి ఫ్లాష్ సేల్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి

ఇండియాలో, షావోమి తాజాగా తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్లయినటువంటి రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ఫ్లాష్ సేల్ ఈ రోజు జరిగింది. అయితే, వీటిలో రెడ్మి నోట్ 7 ప్రో యొక్క మొదటి ఫ్లాష్ సేల్ ఈ రోజు జరుగగా రెడ్మి నోట్ 7 యొక్క రెండవ ఫ్లాష్ సేల్ కూడా షావోమి ఇదే రోజు చేపట్టింది. ఈ ఫోను కోసం చాల ఆతృతగా ఎదురు చూస్తున్న కొనుగోలుధారులు, సేల్ మొదలు పెట్టిన వెంటనే ఎగబడి కొనేశారు. ఈ ఫోన్లను ఎంత వేగంగా కొన్నారంటే, కేవలం సేల్ మొదలైన 2 నిముషాల లోపుగానే, రెడ్మి నోట్ 7 ప్రో యొక్క మొత్తం ఫోన్లు mi.com మరియు Flipkart రెడింటిలో కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంతగా క్రేజ్ రావడానికి కారణం, ఈ రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోనులో అందించిన ప్రధాన కెమేరా అయినటువంటి 48MP మరియు స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ గా చెప్పొచ్చు. కెమేరా గురించి ఎప్పటి నుండి చెప్పడం వలన చాల మందికి దానికి తెలుసు, కానీ ఇటీవలి విడుదల చేసిన బెంచ్ మార్కుల వలన ఈ ప్రాసెసర్ మంచి పెరఫార్మన్స్ అందిస్తున్న విషయం కూడా స్పష్టమవడంతో ఈ ఫోనుకు అంత క్రేజ్ వచ్చింది. వాస్తవానికి, స్వతహాగానే షావోమి స్మార్ట్ ఫోన్లంటే చైనాలో కంటే కూడా ఇండియాలోనే క్రేజ్ ఎక్కువ.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క తరువాతి ఫ్లాష్ సేల్ మార్చి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించనుంది. mi హోమ్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ స్టాక్ లేకపోవడంతో ఆన్లైన్ పైన ఆధార పడి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు కొనాలనుకొని ఏ ఫోన్ను కొనలేక పోయిన వారు ఇక 20 తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి.       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo