Redmi Note 15 Pro 5G India launch and features confirmed
Redmi Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ కూడా షియోమీ కన్ఫర్మ్ చేసింది. రీసెంట్ గా రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ ప్రో వేరియంట్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ కూడా చేస్తోంది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
రియల్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను జనవరి 29న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ కొత్త అప్డేట్ విడుదల చేసింది.
రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీ కలిగి ఉంటుంది . ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది అడ్వాన్డ్స్ 4nm చిప్ సెట్ మరియు జతగా 12GB ఫిజికల్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ వంటి గొప్ప సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 200MP మెయిన్ కెమెరా మరియు జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో HDR + AI సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో ఉంటుంది మరియు IP66, IP68, IP69 మరియు IP69K ఇండస్ట్రీ లీడింగ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి వుంది.
Also Read: Sony Dolby Soundbar పై సేల్ తర్వాత కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!
ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఇందులో 6500 mAh బిగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 100W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వేగంగా రివర్స్ ఛార్జ్ చేసే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.