Flipkart Sale భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Dolby Smart Tv లభిస్తోంది.!

HIGHLIGHTS

కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Dolby Smart Tv లభిస్తోంది

లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది

యూజర్లు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే నుంచి లభిస్తున్న ఈ ఆఫర్ ని చూడవచ్చు

Flipkart Sale ఈరోజు అనౌన్స్ చేసిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Dolby Smart Tv లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. బడ్జెట్ ధరలో 55 ఇంచ్ డాల్బీ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న యూజర్లు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే నుంచి లభిస్తున్న ఈ ఆఫర్ ని చూడవచ్చు.

Flipkart Sale : Dolby Smart Tv డీల్

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బిగ్ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 65%భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 22,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని అతి తక్కువ EMI తో అందుకునే అవకాశం కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ తో జతగా సౌండ్ బార్ తీసుకునే వారికి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఆఫర్ లభిస్తుంది.

అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ టీవీ పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అందించలేదు. అయినా కూడా ఈ టీవీ ఈ ప్రైస్ లో బెస్ట్ 55 ఇంచ్ టీవీ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Also Read: వరదలు ముందే గుర్తించే కొత్త టెక్నాలజీ Groundsource AI తెచ్చిన గూగుల్.!

iFFALCON (55) Dolby Smart Tv: ఫీచర్స్

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 2 జీబి ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఐఫాల్కన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మంచి స్లీక్ డిజైన్ మరియు బెజెల్ లెస్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

ఇక ఈ 55 ఇంచ్ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ రెండు స్పీకర్లతో తోట 24W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS X సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, USB, HDMI, ఈతర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :