ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 15 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్డ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అద్భుతమైన సౌండ్ బార్ డీల్ ప్రకటించింది

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది

ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.2.4 ఛానల్ తో గొప్ప స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది

ఫ్లిప్ కార్డ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు అద్భుతమైన సౌండ్ బార్ డీల్ ను యూజర్ల కోసం ప్రకటించింది. అదేమిటంటే, మోటరోలా రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ డిస్కౌంట్ తోనే ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను ఇంత తక్కువ ధరలో సేల్ చేస్తోంది. స్మార్ట్ టీవీ కి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్ పరిశీలించవచ్చు.

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

మోటోరోలా గత సంవత్సరం ఇండియాలో విడుదల చేసిన 5.2.4 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ AmphisoundX Vibe పై ఈరోజు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి 79% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 15,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ మోటోరోలా సౌండ్ బా ఇటీవల కూడా రూ.17,999 రూపాయల ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు ఆల్ టైం చవక ధరలో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.

Also Read: Poco X8 Pro 5G లాంచ్ డేట్ అండ్ టాప్ ఫీచర్స్ రివీల్ చేసిన పోకో.!

Motorola 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.2.4 ఛానల్ తో గొప్ప స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బ తో వచ్చే బార్ ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పైన రెండు ఫైరింగ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బార్ తో జతగా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్లను ఉంటుంది. ఈ ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 700 వాట్ జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

సౌండ్ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.2.4 ఛానల్ సెట్ అప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్, HDMI eArc, USB, AUX, CEC సింక్ కంట్రోల్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :