Redmi Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

HIGHLIGHTS

Redmi Note 15 Pro 5G ఇండియా లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ కూడా షియోమీ కన్ఫర్మ్ చేసింది

ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ కూడా చేస్తోంది

ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ కొత్త అప్‌డేట్ విడుదల చేసింది

Redmi Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

Redmi Note 15 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ కూడా షియోమీ కన్ఫర్మ్ చేసింది. రీసెంట్ గా రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ ప్రో వేరియంట్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ కూడా చేస్తోంది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 15 Pro 5G : లంచ్ డేట్?

రియల్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను జనవరి 29న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ కొత్త అప్డేట్ విడుదల చేసింది.

Redmi Note 15 Pro 5G : ఫీచర్స్

రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీ కలిగి ఉంటుంది . ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది అడ్వాన్డ్స్ 4nm చిప్ సెట్ మరియు జతగా 12GB ఫిజికల్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ వంటి గొప్ప సపోర్ట్ కలిగి ఉంటుంది.

Redmi Note 15 Pro 5G

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 200MP మెయిన్ కెమెరా మరియు జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో HDR + AI సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో ఉంటుంది మరియు IP66, IP68, IP69 మరియు IP69K ఇండస్ట్రీ లీడింగ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి వుంది.

Also Read: Sony Dolby Soundbar పై సేల్ తర్వాత కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఇందులో 6500 mAh బిగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 100W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వేగంగా రివర్స్ ఛార్జ్ చేసే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo