వరదలు ముందే గుర్తించే కొత్త టెక్నాలజీ Groundsource AI తెచ్చిన గూగుల్.!

HIGHLIGHTS

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది

కొత్త ఏఐ టెక్ రాబోయే వరదలను ముందుగా అంచనా వేసి హెచ్చరికలు అందిస్తుంది

గూగుల్ కొత్తగా తెచ్చిన ఏఐ బేస్డ్ టెక్నాలజీ Groundsource AI వరదలు ముందే చెబుతుంది

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కేవలం ఆన్లైన్ పనులకు మాత్రమే ఉపయోగపడిన AI, ఇప్పుడు వాతావరణాన్ని అంచనా వేసి రాబోయే విపత్తులను ముందుగానే తెలియజేసే స్థాయికి చేరుకుంది. అవును ఇప్పుడు గూగుల్ కొత్తగా తెచ్చిన ఏఐ బేస్డ్ టెక్నాలజీ Groundsource సరిగ్గా ఈ మాటను నిజం చేస్తుంది. అదేమిటంటే, గూగుల్ కొత్త ఏఐ టెక్ రాబోయే వరదలను ముందుగా అంచనా వేసి హెచ్చరికలు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వరదల కారణంగా సంభవించే నష్టాన్ని ఈ ఫీచర్ తో తగ్గించే అవకాశం ఉంటుంది.

Google Groundsource ఏమిటి?

గూగుల్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వరదలను ముందుగా పసిగట్టే లేదా అంచనా వేసే టెక్నాలజీని గూగుల్ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఈ కొత్త ఏఐ టెక్నాలజీని Groundsource గా ప్రకటించింది. గూగుల్ లేటెస్ట్ గా అందించిన ఈ సిస్టమ్ ఉపయోగంతో నగరాలకు రాబోతున్న వరదల హెచ్చరికలు ముందుగా అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త టెక్నాలజీతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని గూగుల్ చెబుతోంది.

వాస్తవానికి, గూగుల్ తెచ్చిన ఈ కొత్త టెక్ గూగుల్ జెమినీ ఏఐ సహాయంతో ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న రికార్డులు, లేటెస్ట్ న్యూస్ మరియు గత వరదల ప్యాట్రన్ వంటి పబ్లిక్ డేటాను బాగా విశ్లేషించి, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2.6 మిలియన్ వరదల డేటా బేస్ రూపొందించిందట. దీని ఆధారంగా గూగుల్ AI టెక్నాలజీ భవిష్యత్తులో వచ్చే వరదలు అంచనా వేస్తుందని గూగుల్ తెలిపింది.

ఎంత ముందు హెచ్చరిక ఇస్తుంది?

ఈ కొత్త టెక్నాలజీ గురించి చెప్పగానే ఎక్కువ మందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే అవుతుంది. నిజమే, ఈ గూగుల్ ఏఐ టెక్ ఎంత ముందు హెచ్చరిక ఇస్తుంది? అనే ప్రశ్న నాకు వచ్చింది. ఈ టెక్ ఫీచర్స్ గురించి కూడా గూగుల్ ముందే తెలిపింది. ఈ AI టెక్నాలజీ వరదలు రావడానికి 24 గంటల ముందే హెచ్చరిక అందిస్తుందని చెబుతున్నారు. అయితే, కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వచ్చే వరదలను 5 నుంచి 7 రోజుల ముందే అంచనా వేయగలదని తెలిపింది. ఈ సిస్టమ్ అందించే అలర్ట్ తో ప్రభుత్వాలు ముందుగానే అత్యవసర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

Also Read: Lava Bold 2 5G: బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ లాంచ్ అయ్యింది.!

ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది?

ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క పూర్తి సమాచారం Google Flood Hub అనే ప్లాట్‌ ఫామ్‌ లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్ ఫామ్ లో వరద ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలు మరియు ఏ ప్రాంతాలు ప్రభావితమవుతాయో కూడా తెలియజేస్తుంది. ఇవి కాకుండా ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం ఎంత పెరిగే అవకాశం ఉందో కూడా ముందుగానే వివరాలు అందిస్తుంది.

గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఏఐ టెక్ మరియు Flood Hub టెక్నాలజీ రెండూ కూడా భవిష్యత్తులో రాబోయే విపత్తు మరియు వాటి నిర్వహణ లో కీలక పాత్ర పోషించే అవకాశముంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :