Lava Bold 2 5G బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

Lava Bold 2 5G ను స్టైలిష్ అండ్ న్యూ డిజైన్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది

లావా బోల్డ్ 2 పైన కూడా లావా తన ఉచిత హోమ్ సర్వీస్ ఆఫర్ ని అందించింది

Lava Bold 2 5G: ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే, లావా బోల్డ్ 2 5జి స్మార్ట్ ఫోన్ ను స్టైలిష్ అండ్ న్యూ డిజైన్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఇందులో పవర్ ఫుల్ బడ్జెట్ చిప్ సెట్ మొదలుకొని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన FHD+ డిస్ప్లే వంటి అన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Lava Bold 2 5G : ప్రైస్

లావా ఈ లేటెస్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఇది 6GB + 128GB వేరియంట్ ప్రైస్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ప్రైస్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా సేల్ చేస్తుంది. ఈ ఫోన్ ఫెదర్ వైట్ మరియు మిడ్ నైట్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.

Lava Bold 2 5G : ఫీచర్స్

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5 లక్షల కంటే టెక్కువ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7060 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ LPDDR5 ఫిజికల్ ర్యామ్, 6 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కాలంగా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అయ్యింది. మంచి విషయం ఏమిటంటే లావా ఫోన్స్ బోట్ వేర్ లేకుండా ఉంటాయి.

ఈ ఫోన్ లో 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరాని లావా అందించింది. ఈ ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. అయినా కూడా ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా లావా అందించింది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.

Also Read: POCO C85x 5G: అత్యంత చవకైన బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ పైన కూడా లావా తన ఉచిత హోమ్ సర్వీస్ ఆఫర్ ని అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :