200MP మెగా OIS కెమేరాతో వస్తున్న Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

రెడ్ మి నోట్ 13 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను విడుదలకు డేట్ అనౌన్స్ చేసింది

Redmi Note 13 Pro+ 5G ను జనవరి 4వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్

ఈ ఫోన్ 200MP మెగా OIS కెమేరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది

200MP మెగా OIS కెమేరాతో వస్తున్న Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్.!

రెడ్ మి నోట్ 13 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను విడుదల చెయ్యడానికి షియోమి డేట్ అనౌన్స్ చేసింది. Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ను జనవరి 4వ తేదీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో షియోమి అధికారిక వెబ్సైట్ నుండి టీజింగ్ ను కూడా ప్రారంభించింది. కంపెనీ అందించింది టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 200MP మెగా OIS కెమేరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 13 Pro+ 5G

Redmi Note 13 Pro+ 5G with 200MP mega ois camera and launch date details revealed
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి

రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ లాంచ్ ఈవెంట్ జనవరి 4న జరుగుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ప్రకటనతో పాటుగా ఈ ఫోన్ టీజర్ పేజ్ ను కూడా షియోమి అందించింది. ఈ టీజర్ పేజ్ నుండి అందించిన ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ అందమైన లెథర్ డిజైన్ తో వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు.

రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి సన్నగా మరియు కొత్త డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వాటర్ రెసిస్టెంట్ డిజైన్ ను కలిగి ఉన్నట్లుగా కూడా ఊహిస్తున్నారు. ఎందుకంటే, టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ సగం నీటిలో మునిగి ఉన్నట్లు చూపిస్తోంది షియోమి.

Also Read : Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

200MP Mega OIS

Redmi Note 13 Pro+ 5G with 200MP mega ois camera
రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్

రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను వెనుక డ్యూయల్ ఫ్లాష్ తో జతగా భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెగా కెమేరా ఉన్నట్లు ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుండి మరొక ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Design

ఈ ఫోన్ డిజైన్ కూడా ఈ ఇమేజ్ ద్వారా క్లియర్ గా తెలిసిపోతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ప్రీమియం లెథర్ బ్యాక్ ను మల్టిపుల్ కలర్ లతో కలిగి వుంది. ఈ కలర్ మరియు డిజైన్ ఈ ఫోన్ ను యూనిక్ గా ఉండేలా చేస్తున్నాయి. అలాగే, రైట్ సైడ్ లో వాల్యూమ్ మరియు పవర్ బటన్ ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు.

ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం వుంది కాబట్టి, మరిన్ని ఫీచర్లను ఒక్కొక్కటిగా విడుదల చేసే వీలుంది. ఈ ఫోన్ యొక్క ఒక ఫీచర్ ను రేపు విడుదల చేస్తుందని కంపెనీ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo