Google PIxel 11 Pro Fold డిజైన్ రివీల్ చేసిన గూగుల్ .. అల్ట్రా ప్రీమియం స్టైల్ ఖాయం.!

HIGHLIGHTS

Google PIxel 11 Pro Fold స్మార్ట్ ఫోన్ డిజైన్ ను రివీల్ చేసే కొత్త టీజర్ రిలీజ్

ఇంకా కేవలం రెండు రోజుల్లో ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ తో మార్కెట్ ని మరింత వేడెక్కించింది

Google PIxel 11 Pro Fold డిజైన్ రివీల్ చేసిన గూగుల్ .. అల్ట్రా ప్రీమియం స్టైల్ ఖాయం.!

Google PIxel 11 Pro Fold స్మార్ట్ ఫోన్ డిజైన్ ను రివీల్ చేసే కొత్త టీజర్ ను గూగుల్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా కేవలం రెండు రోజుల్లో ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడుతుంది. లాంచ్ డేట్ దగ్గరికి రావడంతో గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ తో మార్కెట్ ని మరింత వేడెక్కించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google PIxel 11 Pro Fold టీజర్ ఏమిటి?

గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కోసం డేట్ అండ్ టైం ఫిక్స్ చేసింది. ఈ సిరీస్ భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12వ తేదీ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు లాంచ్ అవుతుంది. అంతేకాదు, అదే రోజు నుంచి ఈ సిరీస్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా ప్రారంభం అవుతుంది.

ఇక గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్ టీజర్ విషయానికి వస్తే, గూగుల్ స్టోర్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి కొత్త టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ లో గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ డిజైన్ ని రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ టీజర్ ప్రకారం, ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్స్ మరియు స్ట్రాంగ్ హింజ్ కలిగి ఉంటుంది.

Google PIxel 11 Pro Fold

ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. అంతేకాదు, ఇది బుక్ స్టైల్ ఫోల్డబుల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో బ్రైట్ అండ్ బిగ్ డిస్ప్లే, స్పీకర్ గ్రిల్ మరియు 3.5mm జాక్ పోర్ట్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ పై మార్కెట్ వర్గాల అంచనా స్పెక్స్ మరియు లీక్స్ మాత్రం ఈ ఫోన్ గురించి ఒక అవగాహన ఇస్తున్నాయి.

Also Read : అబ్బురపరుస్తున్న Motorola Edge 70 Neo కొత్త లీక్స్ : 200MP కెమెరా మరియు వైర్లెస్ ఛార్జ్ .. ఇంకా ఎన్నో.!

Google PIxel 11 Pro Fold : అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ లాంచ్ కంటే చాలా ముందుగా ఈ ఫోన్ అంచనా మరియు రూమర్ స్పెక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫారిన్ లీక్స్ మరియు మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫోన్ స్పెక్స్ అంచనా వేశారు. వీటి ప్రకారం, ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 8 ఇంచ్ M16 OLED స్క్రీన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ఫోన్ లో సరికొత్త గూగుల్ Tensor G6 చిప్ సెట్ ఉండొచ్చని కూడా లీక్స్ ఉన్నాయి. ఆలాగే, ఈ ఫోన్ లో 12GB నుంచి 16GB వరకు ర్యామ్ మరియు 256GB / 512GB / 1TB స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉండవచ్చు. ఇందులో ట్రిపుల్ మెయిన్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ గురించి కూడా అంచనా వేసి చెబుతున్నారు.

ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా జస్ట్ రెండు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి, రెండు రోజులు ఈ అంచనా స్పెక్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఫీచర్స్ గురించి అఫీషియల్ గా గూగుల్ వివరాలు రిలీజ్ చేయలేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile