Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

HIGHLIGHTS

Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్

శామ్సంగ్ పవర్ ఫుల్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ధర మరింత చవకగా మారిపోయింది

ఈ ఫోన్ పైన అమేజాన్ రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను జత చేసింది

Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

Samsung Galaxy M34 5G పైన భారీ కూపన్ ఆఫర్ ప్రకటించిన అమేజాన్ . ఈ ఆఫర్ దెబ్బకి శామ్సంగ్ పవర్ ఫుల్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ధర మరింత చవకగా మారిపోయింది. అమేజాన్ ఈరోజు చాలా స్మార్ట్ ఫోన్ల పైన చాలా ఆఫర్లను అందించింది. ఇందులో ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఆకర్షణీయమైందిగా నిలిచింది. కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అందించగల కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ అఫర్ సరిగ్గా సరిపోతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M34 5G Offer

శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 16,499 అఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఫోన్ పైన అమేజాన్ రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను జత చేసింది. ఈ ఆఫర్ ద్వారా ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ను Samsung Axis Signature Credit Card తో కొనే వారికి 10% డిస్కౌంట్, అంటే రూ.1,499 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు.

Also Read : Google Maps లో అద్భుతమైన ఫీచర్ లను జత చేసిన గూగుల్.!

శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP+8MP+2MP ట్రిపుల్ కెమేరాని కలిగి వుంది. దీన్ని నో షేక్ కెమేరాగా చెబుతోంది శామ్సంగ్ మరియు ఇందులో గొప్ప ఫోటోలను మరియు మంచి స్టడీ వీడియోలను చిత్రీకరించవచ్చు. ఈ ఫోన్ లో చిత్రీకరించే స్లోమోషన్ వీడియోలు మిమ్మల్ని మరింతగా ఆకర్షిస్తాయి మరియు ఈ బడ్జెట్ లో గొప్ప ఫోటోలను అందించగల ఫోన్ గా దీని గురించి చెప్పవచ్చు.

ఈ ఫోన్ లో కంటెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం మంచి డిస్ప్లేని కూడా శామ్సంగ్ అందించింది. FHD+ రిజల్యూషన్ కలిగిన 6.5 ఇంచ్ Super AMOLED డిస్ప్లేని శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి కలిగి వుంది. ఈ ఫోన్ Exynos 1280 5G ప్రోసెసర్ ని 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో కలిగి వుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ బడ్జెట్ కేటగిరిలో OIS కెమేరా, సూపర్ AMOLED మరియు 6,000mAh పవర్ ఫుల్ లాంగ్ బ్యాటరీ కలిగిన బెస్ట్ ఫోన్ గా శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి ఫోన్ మనం చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo