108MP కెమెరా బడ్జెట్ ఫోన్ రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫస్ట్ సేల్

HIGHLIGHTS

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫస్ట్ సేల్

నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్ తో వస్తుంది

108MP కెమెరా బడ్జెట్ ఫోన్ రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫస్ట్ సేల్

షియోమీ, ఇండియాలో భారీ ప్రత్యేకతలతో విడుదల చేసిన రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరుగుతుంది. ఈ రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. అంతేకాదు, పెద్ద బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్: ధర

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ (6జీబీ + 64 జీబీ )   : రూ.18,999

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ (6జీబీ + 128 జీబీ ) : రూ.19,999

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ (8జీబీ + 128 జీబీ ) : రూ. 21,999

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్:ప్రత్యేకతలు

ఈ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 1200 పీక్ బ్రైట్నెస్ తో పాటుగా  HDR 10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ సేఫ్టీ కోసం గొరిల్లా గ్లాస్ 5 ని కూడా అందించింది.  

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G  ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వరకూ జత చేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 11  ఆధారితంగా MIUI 12 స్కిన్ పైన నడుస్తుంది.

ఇక కెమెరాల పరంగా, నోట్ 10 ప్రో మ్యాక్స్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP సూపర్ టెలీ మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo