Redmi A7 Series launch announced in india
Redmi A7 Series నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ఈరోజు అనౌన్స్ చేసింది. రీసెంట్ గా, రెడ్ మీ ఏ7 సిరీస్ నుంచి ఏ7 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రెడ్ మీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో ఏ7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈ సిరీస్ నుంచి అందించిన రెడ్ మీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి ఎటువంటి స్మార్ట్ ఫోన్ అందజేయబోతుందో చూడాలి.
రెడ్ మీ ఏ 7 సిరీస్ నుంచి రెడ్ మీ ఏ 7 మోడల్ ను లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెడ్ మీ ఏ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 21వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి టీజ్ అవుతోంది మరియు లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.
రెడ్ మీ ఏ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ స్లిమ్ ఫోన్ గా లాంచ్ అవుతుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ గా ఉన్న పెద్దగా ఉంటుంది. ఈ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పవర్ కోర్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, లేటెస్ట్ షియోమీ హైపర్ OS 3 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.
ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ 4 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అందుకుంటుందని షియోమీ తెలిపింది. ఇందులో హైపర్ ఐల్యాండ్ ఫీచర్ కూడా ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కూడా రెడ్ మీ ఏ 7 ప్రో స్మార్ట్ ఫోన్ మాదిరిగా AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి డ్యూరబిలిటీ డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఈ ఫోన్ ను 6300 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. మొత్తానికి ఈ ఫోన్ ను కూడా బిగ్ సైజు లో గొప్ప ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: Akshaya Tritiya సందర్భంగా పుంజుకున్న Gold Price : లైవ్ అప్ డేట్ తెలుసుకోండి.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 10,000 లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ అంచనా ప్రైస్ ఎంతవరకు నిజం అవుతుందో తెలుస్తుంది.