Smartphone ధరలు అమాంతం పెరగడానికి రీజన్ ఇదేనంట బ్రో.!

HIGHLIGHTS

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా ఇమిడిపోయింది

గత కొన్ని నెలలుగా స్మార్ట్‌ ఫోన్‌ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి

గతంలో తక్కువ ధరలో లభించిన Smartphone లు ఇప్పుడు చాలా ఖరీదైన సాధనంగా మారాయి

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా ఇమిడిపోయింది. ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకింగ్, వినోదం, ఫోటోగ్రఫీ మొదలుకొని ఎడ్యుకేషన్ వరకు అనేక పనులకు స్మార్ట్‌ ఫోన్ అవసరం అవుతోంది. అంతేకాదు, బడ్జెట్ ధరలో లభించే ప్రత్యేకమైన పరికరంగా కూడా స్మార్ట్ ఫోన్ నిలుస్తుంది. అయితే, గత కొన్ని నెలలుగా స్మార్ట్‌ ఫోన్‌ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో తక్కువ ధరలో లభించిన Smartphone లు ఇప్పుడు చాలా ఖరీదైన సాధనంగా మారాయి. ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి.

ముడి పదార్థాల ధరల పెరుగుదల

స్మార్ట్ ఫోన్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ముడి పదార్థాల ధరల పెరుగుదల. స్మార్ట్‌ ఫోన్ తయారీలో ఉపయోగించే లిథియం, రాగి, అల్యూమినియం వంటి అరుదైన ఖనిజం ముడి పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం నేరుగా తయారీ ఖర్చు పై పడుతుంది. అందుకే, స్మార్ట్ ఫోన్ ప్రైస్ లు గతంతో పోలిస్తే చాలా గణనీయంగా పెరిగాయి.

చిప్‌ కొరత

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడింది. స్మార్ట్‌ ఫోన్‌ లలో ఉపయోగించే ఈ చిప్‌ లు తక్కువగా అందుబాటులో ఉండటంతో వాటి ధరలు పెరిగాయి. ఇది స్మార్ట్ ఫోన్ కు గుండెకాయ లాంటిది, దీంతో ఫోన్ తయారీ వ్యయం కూడా అధికమైంది.

ఆధునిక టెక్నాలజీ వినియోగం

గతంతో పోలిస్తే, ప్రస్తుతం లాంచ్ అవుతున్న స్మార్ట్‌ ఫోన్‌ లలో మరింత శక్తివంతమైన అత్యాధునిక ప్రాసెసర్లు, AMOLED డిస్‌ప్లేలు, 5G సపోర్ట్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఫీచర్లు మరియు కెమెరాలు వంటి సాంకేతికత ఉన్నాయి. ఈ భాగాలు తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్ల ఫోన్ మొత్తం ధర కూడా పెరుగుతుంది.

రవాణా మరియు ఉత్పత్తి ఖర్చులు

అంతర్జాతీయ రవాణా ఖర్చులు మరియు ఇంధన ధరలతో పాటు కార్మిక వ్యయం పెరగడం వల్ల తయారీ సంస్థలకు అదనపు భారం మోయాల్సి వస్తోంది. అందుకే, ఈ అదనపు ఖర్చును కూడా తయారీ కంపెనీలు ఉత్పత్తి ధరలో జత చేస్తున్నాయి.

పరిశోధన మరియు కొత్త ఆవిష్కరణలు

ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి తీసుకురావడానికి అన్ని కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. AI ఫీచర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, అధునాతన కెమెరా సాంకేతిక, వంటి వాటి అభివృద్ధికి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. ఈ భారం కూడా స్మార్ట్ ఫోన్ ధరలో చేరుతాయి. ఇది కూడా స్మార్ట్ ఫోన్ ప్రైస్ పెరగడానికి ఒక కారణం.

Also Read : Sony Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో చీప్ ప్రైస్ లో లభిస్తుంది.!

5G మరియు AI సాంకేతికత

5G నెట్‌ వర్క్‌ కు అనుకూలంగా పనిచేసే ప్రత్యేక హార్డ్‌ వేర్ మరియు లేటెస్ట్ AI ఆధారిత పనితీరు కోసం శక్తివంతమైన ప్రాసెసర్లు అవసరం అవుతాయి. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించినప్పటికీ, తయారీ ఖర్చును కూడా పెంచుతుంది.

ధరలు ఇంకా పెరుగుతాయా?

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రాబోయే కాలంలో అత్యాధునిక సాంకేతికతతో వచ్చే స్మార్ట్‌ ఫోన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, అదే సమయంలో మార్కెట్లో పోటీ పెరుగుతున్నందున మధ్యతరగతి మరియు బడ్జెట్ వినియోగదారుల కోసం మంచి ఫీచర్లతో కూడిన బడ్జెట్ ధర ఫోన్లు కూడా అందుబాటులోకి వస్తూనే ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :