Jio
Jio Home Freedom Pack: ఇటీవల జియో ప్రవేశపెట్టిన రూ.10,000 హోమ్ ఫ్రీడమ్ ప్యాక్ గురించి గూగుల్ లో ఎక్కుగా సెర్చ్ చేస్తున్నారు మరియు ఈ ప్లాన్ పై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్లాన్ ను చూసి కొందరు ఇది మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇది జియోఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కోసం రూపొందించిన ప్రత్యేక వార్షిక ప్యాకేజీ. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ఏకంగా 15 నెలల పాటు నిశ్చితంగా ఉండొచ్చు.
రెగ్యులర్ ఇంటర్నెట్ సేవలు దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే హోమ్, చిన్న కార్యాలయాలు మరియు వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికి అనువైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గా ఈ కొత్త ఆఫర్ ను జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెల నెలా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకసారి చెల్లింపుతో సుదీర్ఘ కాలం సేవలు పొందవచ్చు.
ఈ లాంగ్ వ్యాలిడిటీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు పొందే బెనిఫిట్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 15 నెలల లాంగ్ సర్వీస్ వ్యాలిడిటీ అందుకుంటారు. ఇందులో 100 Mbps వరకు వేగవంతమైన ఇంటర్నెట్ మరియు ఎంపిక చేసిన OTT ప్లాట్ ఫామ్‌లకు యాక్సెస్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుతుంది. ఈ వేగంతో యూజర్ 4K వీడియో స్ట్రీమింగ్ ని చాలా చక్కగా ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు చాలా పెద్ద ఫైళ్లను సైతం వేగంగా డౌన్ లోడ్ లేదా అప్ లోడ్ చేయడం వంటి పనులు సులభం చేస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ వేగంతో ఉన్న బ్రాండ్ బ్యాండ్ తో స్మార్ట్ టీవీ, మొబైల్, ల్యాప్ టాప్ వంటి చాలా పరికరాలను ఒకేసారి కనెక్ట్ చేసేనా ఇంటర్నెట్ స్పీడ్ చాలా బాగుంటుంది.
Also Read: iQOO Z11 Lite 5G: బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ తో ఆకట్టుకునే ప్రైస్ తో వచ్చింది.!
పైన తెలిపిన వర్గాల వారికి ఈ ప్లాన్ చాలా గొప్పగా ఉంటుంది.
ముందుగా, మీ ప్రాంతంలో Jio Fiber లేదా Jio Airfiber సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఈ ప్లాన్ లో లభించే OTT సేవల జాబితాను ముందుగానే పరిశీలించండి. ఇన్ స్టాలేషన్, పరికరాలు లేదా ఇతర షరతులు ఉంటే వాటిని కంపెనీ అఫీషియల్ రూల్స్ నుంచి క్లియర్ గా తెలుసుకోండి.