Redmi A1+: బడ్జెట్ ఆండ్రాయిడ్ 12 OS ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

Redmi A1+ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు జరగనున్నది

రెడ్ మీ ఎ1+ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS వంటి ఫీచర్లతో వస్తుంది

ఈ దీపావళి పండుగ కోసం ఈ ఫోన్ ను అఫర్ ధరతో సేల్ చేయనున్నట్లు ప్రకటించింది

Redmi A1+: బడ్జెట్ ఆండ్రాయిడ్ 12 OS ఫోన్ ఫస్ట్ సేల్.!

భారతీయ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ Redmi A1+. ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, రెడ్ మీ ఎ1+ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు జరగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ లేటెస్ట్ రెడ్ మీ ఫోన్ ధర మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi A1+: ధర

షియోమీ ఈ ఫోన్ బేస్ మోడల్ ని 2GB RAM మరియు 32GB స్టోరేజ్ తో ధరతో రూ.7,499 లాంచ్ చేసింది. అదే సమయంలో, 3GB RAM వేరియంట్ 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 గా ప్రకటించింది. అయితే, ఈ దీపావళి పండుగ కోసం ఈ ఫోన్ ను అఫర్ ధరతో సేల్ చేయనున్నట్లు ప్రకటించింది. దీపావళి సేల్ లో భాగంగా, కొనుగోలుదారులు ఈ ఫోన్ 2GB వేరియంట్ ను రూ. 6,999 ధరకు మరియు 3GB వేరియంట్‌ను రూ.7,999 కి కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ అఫర్ ధర కేవలం అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 31 వరకూ Mi.com, Mi హోమ్ స్టోర్స్, Flipkart మరియు రిటైల్ పార్టనర్స్ వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది.       

Redmi A1+: స్పెసిఫికేషన్లు

రెడ్ మీ ఎ1+ స్మార్ట్ ఫోన్ HD+ (720 x 1600 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగిన 6.52-అంగుళాల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే సాధారణ 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు ఫ్రంట్ కెమెరా కోసం పైభాగంలో వాటర్-డ్రాప్ నాచ్‌ ని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio A22 SoC ప్రాసెసర్‌ని కి జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) OS పైన రన్ అవుతుంది.

ఇక ఈ ఫోన్ కలిగిన కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ సెన్సార్ కి జతగా 2ఎంపి డెప్త్ కెమెరా వుంది. ముందు, సెల్ఫీల కోసం 8ఎంపి సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. Redmi A1+ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo