అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ .. డీల్ ప్రైస్ ఎంతంటే.!

HIGHLIGHTS

అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది

అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న టాప్ డీల్స్ తో అమెజాన్ యూజర్లను ఆకర్షిస్తోంది

డీల్స్ లిస్ట్ లో సాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫోన్ టాప్ డీల్ గా ఉంటుందని అమెజాన్ తెలిపింది

అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ .. డీల్ ప్రైస్ ఎంతంటే.!

అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే పెరిగిన మొబైల్ ధరలను దృష్టిలో పెట్టుకుంటే, ప్రస్తుతం ఒక స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ఆచి తూచి వేయాల్సిన అడుగు గా మారింది. అయితే, పండుగ సీజన్ వస్తే మొబైల్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, అందరి దృష్టి పండుగ సేల్ పైనే ఉంటుంది. ఈ అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న టాప్ డీల్స్ తో అమెజాన్ యూజర్లను ఆకర్షిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

GIF Sale – Samsung Galaxy S25 Ultra 5G డీల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్ గురించి అమెజాన్ ఇండియా గత వారం రోజులుగా టీజింగ్ చేస్తూ వస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ సేల్ కంటే ముందుగా ఆఫర్ చేయనున్న డీల్స్ తో ‘ఎర్లీ డీల్స్’ ని కూడా అమెజాన్ అందించింది. అయితే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఇప్పుడు రిలీజ్ చేసింది. ఈ డీల్స్ లిస్ట్ లో సాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫోన్ టాప్ డీల్ గా ఉంటుందని అమెజాన్ తెలిపింది.

ఆఫర్ ప్రైస్ ఎంత?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 99,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. వాస్తవానికి, ఈ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, కొత్త జనరేషన్ ఫోన్స్ రాకతో మెల్లగా ప్రైస్ డౌన్ అయ్యింది. అయితే, పెరిగిన మొబైల్ మార్కెట్ ప్రైస్ హైక్ తో ఈ ఫోన్ ప్రైస్ కూడా పెరిగింది.

amazon GIF Sale - Samsung Galaxy S25 Ultra 5G deal

ఆఫర్ ప్రైస్ ఎంత? అని చూస్తే, ఈ ఫోన్ సేల్ ఆఫర్ ప్రైస్ ను అమెజాన్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుందని అమెజాన్ చెబుతున్న తీరు మరియు టీజింగ్ చూస్తుంటే, ఈ ఫోన్ ప్రైస్ ని గట్టిగానే తగ్గించేలా కనిపిస్తోంది. అయితే, ఎంత తగ్గిస్తుంది మరియు ఈ ఫోన్ ను ఎంతకు ఆఫర్ చేస్తుందనేది, ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఇక గత సేల్ నుంచి ఈ ఫోన్ సేల్ అయిన డేటాని పరిశీలిస్తే, ఈ ఫోన్ గరిష్టంగా 70 వేల రూపాయల అతి చవక ధరలో కూడా అమెజాన్ నుంచి సేల్ అయ్యింది. అయితే, అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి ఈ ఫోన్ కేవలం రూ. 84,999 వరకు మాత్రమే తగ్గింపు అందుకుంది. అందుకే, ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ పై ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగింది.

Also Read: Oppo K14 Plus 5G: రేపు రిలీజ్ అయ్యే ఒప్పో ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ముందే తెలుసుకోండి.!

ఇది ఇలా ఉంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 నుంచి ఈ ఫోన్ ను 80 వేల కంటే తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. అమెజాన్ సేల్ నుంచి ఈ ఫోన్ ఎటువంటి ప్రైస్ తో సేల్ అవుతోందో తెలియాలంటే ఇంకా 10 రోజులు వేచి చూడాల్సిందే.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile