Oppo K14 Plus 5G: రేపు రిలీజ్ అయ్యే ఒప్పో ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

Oppo K14 Plus 5G రేపు ఇండియన్ మార్కెట్లో విడుదలవుతుంది

లాంచ్ కంటే ముందే ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వివరాలు తెలుసుకోండి

ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో ఒప్పో లాంచ్ చేస్తోంది

Oppo K14 Plus 5G: రేపు రిలీజ్ అయ్యే ఒప్పో ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ముందే తెలుసుకోండి.!

Oppo K14 Plus 5G: ఒప్పో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 14 ప్లస్ రేపు ఇండియన్ మార్కెట్లో విడుదలవుతుంది. లాంచ్ కంటే ముందే ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వివరాలు ఈరోజు అందిస్తున్నాము. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో ఒప్పో లాంచ్ చేస్తోంది. మరి ఈ ఫోన్ ఈ ఫీచర్స్ తో ఎటువంటి బడ్జెట్ ప్రైస్ లో లాంచ్ అవుతోందో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఒప్పో కె 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా టీజింగ్ చేసింది కాబట్టి, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Oppo K14 Plus 5G: ఫీచర్స్

ఒప్పో ఈ ఫోన్ ను సరికొత్త కలర్స్ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ని గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కి తగిన 6.78 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ తో అందిస్తుంది. అంతేకాదు, గేమింగ్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్, కంటెంట్ కోసం 1.5K రిజల్యూషన్ మరియు ఎండలో కూడా చూడటానికి వీలుగా 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఫోన్ అన్లాక్ కోసం మరింత సెక్యూర్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Max శక్తితో పని చేస్తుంది. ఇది 1Mn కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ ప్రాసెసర్ మరియు కొత్తగా రిలీజ్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ లో మరింత వేగం కోసం 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 16GB ర్యామ్ ని కూడా అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 256GB స్టోరేజ్ కెపాసిటీ తో వస్తుంది. ఈ మొత్తం సిస్టం ను వేగంగా కూల్ చేయడానికి పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ని కూడా జతగా అందించింది.

Oppo K14 Plus 5G

కెమెరా పరంగా, ఈ వివో కొత్త ఫోన్ లో వెనుక 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా ఉంటాయి. అలాగే, ఇందులో 16MP Sony IMX 480 సెల్ఫీ కూడా ఫోన్ స్క్రీన్ లో ఉంటుంది. ఇక ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 8000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ భారీ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 45W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించింది.

ఈ ఒప్పో కొత్త ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ డిజైన్ తో పాటు IP69K రేటింగ్ తో గొప్ప వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించింది. మొత్తంగా ఈ ఫోన్ ను అల్రౌండ్ ఫీచర్స్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో ఒప్పో రిలీజ్ చేస్తోంది.

Also Read: Redmi 17C మోర్ డిస్ప్లే అండ్ మోర్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!

Oppo K14 Plus 5G: అంచనా ప్రైస్

ఒప్పో ఈ ఫోన్ ను రూ. 28,000 నుంచి రూ. 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నారు. రేపు ఈ ఫోన్ ప్రైస్ పై ఉన్న సస్పెన్స్ వీడిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile