షియోమి ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 10 Prime ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చినా కూడా భారీ ఫీచర్లనే కలిగివుంది. ఈ లేటెస్ట్ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ 50MP క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. అంతేకాదు, మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ గురించిన పూర్తి విశేషాలేమిటో తెలుసుకుందాం.
రెడ్‌మి 10 ప్రైమ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ రూ. 12,499 రూపాయల ధరతో, 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.14,499 రూపాయల ధరతో ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ మరియు మి.కామ్ లలో అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది రీడింగ్ మోడ్ 3.0 తోవస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన పనిచేస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ కేమెరా సిస్టం మంచి డెప్త్ ఫోట్లను తెయ్యగలిగే శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.
రెడ్‌మి 10 ప్రైమ్ ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 6,000 బిగ్ బ్యాటరీ మరియు రిటైల్ బాక్స్ లో 22.5W ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుతుంది. ఈ ఫోన్ 9W తో రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు మరియు AI ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Price: | |
Release Date: | 03 Sep 2021 |
Variant: | 64 GB/4 GB RAM , 128 GB/6 GB RAM |
Market Status: | Launched |