రెడ్‌మి 9 ప్రైమ్ పైన రూ.1000 అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్

రెడ్‌మి 9 ప్రైమ్ పైన రూ.1000 అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్
HIGHLIGHTS

అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్‌ ద్వారా 1,000 రూపాయల క్యాష్ బ్యాక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనులుగోలు పైన 10% డిస్కౌంట్

రెడ్‌మి 9 ప్రైమ్ పైన అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్

షియోమి యొక్క స్మార్ట్‌ ఫోన్లను ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్ నుండి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పొందవచ్చు. ప్రస్తుతం, షియోమి  యొక్క రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ ఫోన్ అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్‌ ద్వారా 1,000 రూపాయల క్యాష్ బ్యాక్  మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనులుగోలు పైన 10% డిస్కౌంట్  లభిస్తాయి.

Redmi 9 Prime Display ప్రత్యేకతలు

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. అదనపు రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంది. ఈ ఫోన్ కొత్త ఆరా 360 డిజైన్‌ తో అలల ఆకృతితో వస్తుంది, ఇది గ్రిప్పిగా చేస్తుంది మరియు 9.1 మిమీ మందంగా ఉంటుంది మరియు 198 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, సన్‌ రైజ్ ఫ్లేర్ మరియు మాట్టే బ్లాక్ అనే నాలుగు రంగులలో వస్తుంది.

Redmi 9 Prime Performance

ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ ‌సెట్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్‌ తో జతచేయబడుతుంది మరియు ఎంచుకోవడానికి 128 జిబి స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. 512GB వరకు మైక్రో SD కార్డులను ఉపయోగించడం ద్వారా ఫోన్ స్టోరేజ్ ను మరింత పెంచే ఎంపిక కూడా ఉంది.

Redmi 9 Prime Camera

రెడ్‌మి 9 క్వాడ్-కెమెరా సెటప్‌ని  కలిగి ఉంది, ఇందులో ప్రాధమిక 13 MP కెమెరాని ఎఫ్ / 2.2 ఎపర్చరు, 8 MP  అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 5MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్‌ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

Redmi 9 Prime Battery

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, అయితే 10W ఛార్జింగ్ అడాప్టర్ ఇన్-బాక్స్ తో వస్తుంది కాబట్టి వినియోగదారులు అడాప్టర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షియోమి ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందించగలదని పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo