హీలియో P70 మొదటి ఫోన్ RealMe U1 అమేజాన్ ప్రత్యేకంగా 28 న విడుదల

హీలియో P70 మొదటి ఫోన్ RealMe U1 అమేజాన్ ప్రత్యేకంగా 28 న విడుదల
HIGHLIGHTS

శక్తివంతమైన సెల్ఫీ కెమేరా మరియు హీలియో P70 SoC దీని సొంతం.

రియల్మీ ఇప్పుడు మరొక సరికొత్త ఫోనుతో మన ముందుకు రానుంది, అదే రియల్మీ U1 స్మార్ట్ ఫోన్. హీలియో P70 SoC శక్తితో రానున్న రియల్మీయొక్క మొట్టమొదటి ఫోను కూడా ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్, నవంబర్ 28 న అమేజాన్ ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు అమేజాన్ తన హోమ్ పేజీలో బ్యానరుతో ప్రకటించింది. ఈ హోమ్ పేజీ బ్యానరులో, ఇండియా యొక్క సెల్ఫీ ప్రో (India's Selfi Pro) అని ఈ ఫోను యొక్క కొన్ని వివరాలను చూపించింది. అమేజాన్ నుండి చూపించిన ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఆవిష్కరణ 28 వ తేదీ మధ్యాహ్నం 12:30 నిముషాలకు జరగనుంది.

Realme U1 teaser cover.jpg

ఈ ఫోను యొక్క వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్  హీలియో P70 SoC శక్తి తో నడుస్తుంది. రియల్మీ 2 ప్రో, ఫోనులో అందించినటువంటి 'డ్యూ డ్రాప్' నోచ్ డిస్ప్లేతో ఈ ఫైన్ వస్తుంది మరియు అత్యంత శక్తివంతమైన సెల్ఫీ కెమెరాని ఈ ఫోనులో అందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోనులో ఆక్యురేట్ AI డిటెక్షన్ వుంది కాబట్టి, AI సహాయంతో సీన్ డిటెక్షనుతో గుర్తించవచ్చు. అలాగే, దీని ప్రాసెసర్ పరంగా చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ అధిక స్థాయి కెమేరాలకి మద్దతివ్వగలదు కాబట్టి, ఈ ఫోనులో అధిక స్థాయి డ్యూయల్ సెన్సర్లను వాడివుండొచ్చు.

అలాగే, బ్యానర్ చిత్రంలో చిత్రంలో కూడా సెల్ఫీ కెమెరాని ప్రధానంగా చూపించారు కనుక, ఈ సెల్ఫీ కెమేరా కచ్చితంగా ఒక మంచి సెన్సర్ అయ్యేటువంటి అవకాశముంది. అయితే, పూర్తి వివరాలు వచ్చే వరకు మనం వీటి యొక్క అంచనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.     

          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo