Best Split AC: మంచి ఫీచర్స్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ 1.5 ఏసీ డీల్స్.!
దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ బడ్జెట్ డీల్స్‌ను పరిశీలించడం మంచిది
మంచి ఫీచర్లతో రూ. 30,000 లోపు ధరలో లభించే Best Split AC డీల్స్
Best Split AC: దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుని ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది కూలర్ల నుంచి ఎయిర్ కండీషనర్ల వైపు మళ్లుతున్నారు. మీరు కూడా కొత్త AC కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ బడ్జెట్ డీల్స్‌ను పరిశీలించడం మంచిది. ముఖ్యంగా, మంచి ఫీచర్లతో రూ. 30,000 లోపు ధరలో లభించే ఉత్తమ 1.5 టన్ స్ప్లిట్ AC ఆఫర్లను ఈరోజు మీ కోసం అందిస్తున్నాం.
SurveyBest Split AC: డీల్స్
ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన సూపర్ కూలింగ్ డేస్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ అందించింది. వీటిలో రెండు బెస్ట్ స్ప్లిట్ ఏసీలు కేవలం 30 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ రెండు బెస్ట్ స్ప్లిట్ ఏసీ డీల్స్ మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
Sharp 2025 1.5 Split AC
ప్రముఖ జపాన్ బ్రాండ్ షార్ప్ 2025 లో అందించిన 1.5 స్ప్లిట్ ఏసీ (AH-SI18V3B-GC) మోడల్ ను ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 28,450 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఏసీ పై నో కాస్ట్ EMI ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఏసీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

ఇక ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఏసి. ఇది హై టెక్ ఇన్వెర్టర్, నాన్ కోరేసివ్ గోల్డ్ ఫిన్ కోటింగ్, సెల్ఫ్ డయాగ్నోసిస్ మరియు యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
Also Read: POCO C81 మరియు C81X బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యాయి.. ఫోన్ ఎలా ఉందంటే.!
TCL 2025 స్ప్లిట్ ఏసీ
టిసిఎల్ గత సీజన్ లో లాంచ్ చేసిన 2025 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 42% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 30,690 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి నో కాస్ట్ EMI ఆఫర్ ను అందించింది.

ఈ ఏసీ ఫీచర్స్ చూస్తే, ఈ ఏసీ ఇది కూడా 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఏసి మరియు ఫిల్టర్ క్లీన్ అలర్ట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఏసీ 100% కాపర్ కాయిల్, PCB పై 5 సంవత్సరాల వారంటీ మరియు ఇన్వర్టర్ కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile