Install App Install App

Realme X7 max 5G: టాప్ ఫీచర్లతో వచ్చిన Realme 5G ఫోన్ మొదటి సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 Jun 2021
HIGHLIGHTS
  • Realme X7 max 5G స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది

  • Realme 5G ఫోన్ యొక్క మొదటి సేల్

  • Super AMOLED డిస్ప్లే మరియు 50W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్

Realme X7 max 5G: టాప్ ఫీచర్లతో వచ్చిన Realme 5G ఫోన్ మొదటి సేల్
Realme X7 max 5G: టాప్ ఫీచర్లతో వచ్చిన Realme 5G ఫోన్ మొదటి సేల్

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ Realme 5G ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం మొదలవుతుంది. ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ స్పీడ్ ప్రాసెసర్ Dimensity 1200 5G తో వచ్చింది. ఈ ప్రాసెసర్ తో మార్కెట్లోకి వచ్చిన  మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు, Super AMOLED డిస్ప్లే మరియు 50W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా మరిన్ని భారీ ఫీచర్లతో Realme X7 Max 5G ను విడుదల చేసింది.

Realme X7 Max 5G: ధర

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. వాటి ధరలు ఈ క్రింద చూడవచ్చు

1. Realme X7 Max 5G (8GB+128GB) : రూ. 26,999

2. Realme X7 Max 5G (12GB+256GB) : రూ. 29,999

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూన్ 4 న మధ్యాహ్నం 12 గంటలకి Flipkart, realme.com వెబ్సైట్ మరియు స్టోర్స్ నుండి మొదలవుతుంది.  

Realme X7 Max 5G: స్పెక్స్

రియల్మి ఎక్స్7 మ్యాక్స్ 5G స్మార్ట్ ఫోన్ 1. డిస్ప్లే 6.43 అంగుళాల 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ గల FHD+ Super AMOLED డిస్ప్లే   పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు 100% DCI-P3 వైడ్ కలర్ గ్యాంబిట్ తో వస్తుంది.

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 1200 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 3.0GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G77 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి మరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

కెమెరా విషయానికి వస్తే, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, ప్రధాన కెమెరాని 64MP Sony IMX682 సెన్సార్ తో ఇంచింది. రెండవ కెమేరాగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మూడవ కెమెరాని  2MP మ్యాక్రో లెన్స్ తో ఇచ్చింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది.

Realme X7 Max 5G  ఒక 4,500mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు. కేవలం 16 నిముషాల్లోనే 50% ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

Realme X7 Max Key Specs, Price and Launch Date

Price:
Release Date: 06 Jun 2021
Variant: 128 GB/8 GB RAM , 256 GB/12 GB RAM
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    6.43" (1080 x 2400)
  • Camera Camera
    64 + 8 + 2 | 16 MP
  • Memory Memory
    128 GB/8 GB
  • Battery Battery
    4500 mAh
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: realme x7 max 5g first sale
Tags:
Realme X7 max 5G Realme X7 max 5G sale Realme X7 max 5G first sale Latest 5g Phone Realme x7 max 5g
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹ 36999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Xiaomi 11i 5G (Stealth Black, 128 GB)(6 GB RAM)
Xiaomi 11i 5G (Stealth Black, 128 GB)(6 GB RAM)
₹ 24999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status