ఇండియాలో విడుదలైన రియల్మీ X50 ప్రో 5G : మతి పోగొట్టే 5 ఫీచర్లు ఇవే

ఇండియాలో విడుదలైన రియల్మీ X50 ప్రో 5G : మతి పోగొట్టే 5 ఫీచర్లు ఇవే
HIGHLIGHTS

5G తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు వస్తుందని అందరూ ఆలోచిస్తుంటుంటే, రియల్మీ మాత్రం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే 5G స్మార్ట్ ఫోన్ను ఇండియాలో ఈరోజు విడుదల చేసింది. అంతేకాదు, 5G తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈఫోను, కేవలం 5G మాత్రమే కాకుండా అనేకమైన భారీ స్పెక్స్ ని కలిగి ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ హై ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ధర కూడా రిజనబుల్ గానే ప్రకటించింది మరియు ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం అమ్మకాలను సాగిస్తున్న   వంటి వాటికి పోటీగా నిలవనుంది. ఇక ఈ ఫోన్ గురించిన ఈ టాప్ 5 ఫీచర గురించి చూస్తే నిజంగా మతి పోతుంది. అందుకే, ఈ టాప్ ఫీచర్లను మీ కోసం అందిస్తున్నాను.  

రియల్మీ X50 ప్రో 5G : టాప్ -5 ఫీచర్లను

1. డిస్ప్లే

ఈ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని ప్రీమియం డిజైనుతో అందించింది. ఇందులో, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)తో పాటుగా AG గ్లాస్ టెక్నాలజీతో అందించింది. ఇది ఒక 6.44 అంగుళాల డిస్ప్లేని 3D AG కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో తీసుకువచ్చింది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల 90Hz డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 100% DCI-P3 మరియు 105% NTSC కలర్ గాముట్ తోపాటుగా 1000+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                            

2. ప్రాసెసర్

ఇది క్వాల్కామ్ యొక్క అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషనుతో పాటుగా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి ఆడవచ్చు.  ఈ స్మార్ట్ ఫోనులో అందించిన 5 డైమాన్షనల్ వేపర్ కూలింగ్ టెక్నలాజితో ఈ ఫోన్ను నిరంతరం చల్లగా ఉంచుతుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 5G సపోర్టుతో వస్తుంది మరియు ఇది ఇండియాలో విడుదలైన మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.   

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను మూడు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.0    

రియల్మీ X50 ప్రో 5G : ధరలు

1. Realme X50 Pro 5G : 6GB ర్యామ్  + 128GB స్టోరేజి : Rs.37,999/-

2. Realme X50 Pro 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.39,999/

3. Realme X50 Pro 5G : 12GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.44,999/

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Samsung ISOCELL GW1 సెన్సారుతో ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.3 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మీకు మ్యాక్రో ఫోటోలను కూడా తియ్యడానికి వెలుపడుతుంది. దీనికి జతగా 12MP టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP బ్లాక్ %& వైట్ పోర్ట్రైట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 32MP Sony IMX616 సెన్సార్ మరియు 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు 120fps తో  స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ రియల్మీ X50 ప్రో 5G ఒక అతిపెద్ద 4,200mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 10V/6.5A ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 20 నిముషాల్లో 60% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు మరియు కేవలం 35 నిముషాల్లోనే ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చెయ్యొచ్చు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo