Realme 8 సిరీస్ కూడా వచ్చేస్తోంది: 108 ఎంపీ కెమెరాతో తెస్తోంది

Realme 8 సిరీస్ కూడా వచ్చేస్తోంది: 108 ఎంపీ కెమెరాతో తెస్తోంది
HIGHLIGHTS

రియల్మీ 8 సిరీస్ లాంచ్ గురించి టీజింగ్

టీజర్ ఇమేజి లో 108ఎంపీ సింబల్ కనిపిస్తోంది.

65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

నిన్ననే రియల్మీ నార్జో 30 సిరీస్ లాంచ్ చేసిన రియల్మీ, వెంటనే తన రియల్మీ 8 సిరీస్ లాంచ్ గురించి టీజింగ్ చేసింది. ఈ టీజింగ్ చూస్తుంటే నుండి ఈ రియల్మీ 8 సిరీస్ లో 108 ఎంపీ కెమెరాతో అందించనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ టీజర్ లో అందించిన ఇమేజి లో 108ఎంపీ సింబల్ కనిపిస్తోంది. అయితే, ఈ రియల్మీ 8 సిరీస్ స్పెషిఫికేషన్ల ఇప్పటికే కొన్ని లీక్స్ వివరించాయి.

రియల్మీ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ల గురించి ముందుగా వచ్చిన లీక్స్ మరియు గీక్ బెంచ్ లో కనిపించిన ఈ ఫోన్ వివరాల ప్రకారం, ఈ ఫోన్ RMX3092 మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ లో కనిపించింది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 720 చిప్ సెట్ తో ఉండనున్నట్లు ఇందులో వివరించింది. అలాగే, 8GB ర్యామ్ మరియు రియల్మీ UI స్కిన్ పైన ఆండ్రాయిడ్ 10 OS తో తీసుకు వస్తున్నట్లు వివరిస్తోంది.

ఇది మాత్రమే కాదు, చైనా యొక్క 3C సర్టిఫికేషన్ లో కూడా దీని గురించి వివరాలు తేలింది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 5G సపోర్ట్ తో కూడా ఉండవచ్చని చూపించింది. అయితే, ఈ ఫోన్ లోపల అందించనున్న హార్డ్ వేర్ గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. రియల్మీ ఈ 8 సిరీస్ యొక్క టీజింగ్ మొదలు పెట్టింది కనుక ఒక్కొక్క విషయాన్ని త్వరలోనే రివీల్ చెయ్యవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo