Realme P4R 5G top features know here
Realme P4R 5G: రియల్‌మీ త్వరలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ Ai ఫీచర్స్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఈ రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ టాప్ అండ్ కీలక ఫీచర్లు కూడా రియల్‌మీ అందించింది.
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ 8.8mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్ బిల్డ్ తో ఉంటుంది.ఇది కాకుండా ఈ ఫోన్ IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంటుంది.
రియల్‌మీ P4R ఫోన్ లో 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ ఉంటుంది.
రియల్‌మీ ఈ ఫోన్ ను MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ లో 14GB వరకు డైనమిక్ ర్యామ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందిస్తుంది.
గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ వంటి హెవీ వర్క్ సయమంలో కూడా ఈ ఫోన్ వేడెక్కకుండా
పెద్ద ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం సపోర్ట్ ను ఈ ఫోన్ లో అందించింది.
ఈ ఫోన్ లో అనేక లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కలిగిన 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ కెమెరాతో జతగా Ai పల్స్ లైట్ కూడా ఉంటుంది.
Also Read: ఆర్థిక సంక్షోభం 2.0: AI యుగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు.!
బ్యాటరీ విభాగంలో ఫోన్ గొప్పగా ఉంటుంది. ఇందులో 8000 mAh భారీ బ్యాటరీ 4 లేయర్ సేఫ్టీ ఫీచర్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జ్, 27W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.