Realme P4R 5G: రియల్‌మీ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ఇవే.!

HIGHLIGHTS

రియల్‌మీ త్వరలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది

లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి

Realme P4R 5G: రియల్‌మీ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ఇవే.!

Realme P4R 5G: రియల్‌మీ త్వరలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ Ai ఫీచర్స్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4R 5G: లాంచ్ డేట్

ఈ రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్‌ ఫోన్‌ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ టాప్ అండ్ కీలక ఫీచర్లు కూడా రియల్‌మీ అందించింది.

Realme P4R 5G: టాప్ ఫీచర్స్

డిజైన్

రియల్‌మీ P4R స్మార్ట్‌ ఫోన్‌ 8.8mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్ బిల్డ్ తో ఉంటుంది.ఇది కాకుండా ఈ ఫోన్ IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంటుంది.

డిస్ప్లే

రియల్‌మీ P4R ఫోన్ లో 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

రియల్‌మీ ఈ ఫోన్ ను MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ తో లాంచ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ లో 14GB వరకు డైనమిక్ ర్యామ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందిస్తుంది.

Realme P4R 5G

కూలింగ్ సిస్టం

గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ వంటి హెవీ వర్క్ సయమంలో కూడా ఈ ఫోన్ వేడెక్కకుండా
పెద్ద ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం సపోర్ట్ ను ఈ ఫోన్ లో అందించింది.

కెమెరా

ఈ ఫోన్ లో అనేక లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కలిగిన 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ కెమెరాతో జతగా Ai పల్స్ లైట్ కూడా ఉంటుంది.

Also Read: ఆర్థిక సంక్షోభం 2.0: AI యుగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు.!

బ్యాటరీ

బ్యాటరీ విభాగంలో ఫోన్ గొప్పగా ఉంటుంది. ఇందులో 8000 mAh భారీ బ్యాటరీ 4 లేయర్ సేఫ్టీ ఫీచర్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జ్, 27W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile