Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ డేట్ అనౌన్స్.!
రియల్‌మీ ఇండియాలో చాలా వేగంగా తన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది
రియల్‌మీ ఇప్పుడు రియల్‌మీ పి 2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ యొక్క లాంచ్ తో పాటు కీలకమైన ఫీచర్స్ కూడా రియల్‌మీ అనౌన్స్ చేసింది
Realme P2 Pro 5G: రియల్‌మీ ఇండియాలో చాలా వేగంగా తన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. రీసెంట్ గా రియల్‌మీ 13 సిరీస్ నుంచి రియల్‌మీ 13 5జి మరియు రియల్‌మీ 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్‌మీ ఇప్పుడు రియల్‌మీ పి 2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క లాంచ్ తో పాటు కీలకమైన ఫీచర్స్ కూడా రియల్‌మీ అనౌన్స్ చేసింది.
SurveyRealme P2 Pro 5G: లాంచ్
రియల్‌మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ ను రియల్‌మీ అధికారిక X అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఈ టీజర్ లో ఈ ఫోన్ యొక్క రెండు కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.
Say hello to #realmeP2Pro5G, packed with the only 80W charging in the segment that keeps you ahead of the game. ⚡
— realme (@realmeIndia) September 4, 2024
Are you ready to elevate your smartphone experience?
Launching 13th Sept, 12 Noon.
Know more: https://t.co/fwXUuY4HJp #FastestCurvedDisplayPhone pic.twitter.com/FpskB8cTHK
Realme P2 Pro 5G: కీలకమైన ఫీచర్స్
రియల్‌మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను 80W ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో లాంచ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇది సెగ్మెంట్ యొక్క ఏకైక ఫోన్ ఇదే అవుతుందని కూడా రియల్‌మీ గొప్పగా చెబుతోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అయ్యే లేదా లభించే ధరలో ఈ ఫీచర్ తో ఉండే ఏకైక ఫోన్ గా నిలుస్తుందని రియల్‌మీ హింట్ ఇచ్చింది.

అంతేకాదు, ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ తో వస్తుందని కూడా టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ తో కనిపిస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు మరియు గ్రీన్ కలర్ ఆప్షన్ ఉన్నట్లు కూడా క్లియర్ అయ్యింది. ఈ కెమెరా OIS సపోర్ట్ కలిగిన కెమెరా అని కూడా ఈ ఇమేజ్ కన్ఫర్మ్ చేసింది.
Also Read: రూ. 21,999 ధరకే మంచి ఫీచర్స్ తో పెద్ద QLED Smart Tv లాంచ్ చేసిన Daiwa.!
ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ కూడా సరికొత్తగా కనిపిస్తోంది మరియు ఇప్పటి వరకూ రియల్‌మీ అందించిన ఫోన్ లలో లేని కొత్త కెమెరా డిజైన్ ను ఈ ఫోన్ లో ఆఫర్ చేయబోతున్నట్లు అర్ధం అవుతోంది.