HIGHLIGHTS
మార్కెట్ లో Daiwa కొత్త బడ్జెట్ 43 ఇంచ్ QLED Smart Tv లాంచ్ చేసింది
ఈ కొత్త స్మార్ట్ టీవీని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో అందించింది
తక్కువ ధరలో వచ్చిన క్యూలెడ్ గూగుల్ టీవీ
భారత స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa ఇండియన్ మార్కెట్ లో కొత్త బడ్జెట్ 43 ఇంచ్ QLED Smart Tv లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో అందించింది. అతి తక్కువ ధరలో వచ్చిన క్యూలెడ్ గూగుల్ టీవీ గా నిలుస్తుంది. ఈ టీవీని మరింత చవక దాతకు అందుకునేలా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా డైవా అందించింది.
Surveyడైవా ఇండియాలో కొత్త 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని రూ. 21,999 ధరతో విడుదల చేసింది,. ఈ స్మార్ట్ టీవీని BOBCARD కార్డ్ తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Flipkart నుంచి సేల్ చేస్తోంది.
Also Read: Samsung Galaxy A06: 10 వేల బడ్జెట్ లో కొత్త డిజైన్ బిగ్ బ్యాటరీ తో వచ్చింది.!
డైవా 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 3840 X 2160 రిజల్యూషన్ కలిగిన 4K UHD క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఇది ARM Quad Core A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ టీవీలో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా డైవా అందించింది. ఈ టీవీలో HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ARC, డ్యూయల్ బ్యాండ్ Wi Fi మరియు ఇయర్ ఫోన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ టీవీ Dolby Audio సాపేట్ తో వస్తుంది 24W సౌండ్ అందించే రెండు స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ Netflix, Prime video మరియు Youtube వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ లో MEMC ఫీచర్ ను మాత్రం అందించలేదు. అయినా, మంచి విజువల్స్ అందిస్తుందని డైవా తెలిపింది.