Samsung Galaxy A06: 10 వేల బడ్జెట్ లో కొత్త డిజైన్ బిగ్ బ్యాటరీ తో వచ్చింది.!
శామ్సంగ్ ఈరోజు భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
Samsung Galaxy A06 ఫోన్ ను మూడు అందమైన కలర్ ఆప్షన్ లతో కూడా అందించింది
ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ సెటప్ తో అందించింది
Samsung Galaxy A06: శామ్సంగ్ ఈరోజు భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, శామ్సంగ్ గెలాక్సీ ఎ06 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ సెటప్ తో అందించింది. ఈ శామ్సంగ్ కొత్త ఫోన్ ను మూడు అందమైన కలర్ ఆప్షన్ లతో కూడా అందించింది.
SurveySamsung Galaxy A06: ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ ఎ06 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఇందులో 4GB + 64GB వేరియంట్ ను రూ. 9,999 ధరలో మరియు రెండవ 4GB + 128GB వేరియంట్ ను రూ. 11,499 రూపాయల ధరకే అందించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్స్ మరియు samsung.com/in అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
Samsung Galaxy A06: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎ06 స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్ తో కనిపించే సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G85 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో అందించింది. ఈ ఫోన్ లో 4GB ర్యామ్ జతగా 64 / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు Knox Vault సెక్యూరిటీ ని కూడా కలిగి ఉంటుంది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50 MP + 2 MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 10X డిజిటల్ జూమ్ కి సపోర్ట్ చేస్తుంది మరియు 60fps వద్ద FHD (1920 x 1080) వీడియో రికార్డు సపోర్ట్ తో ఉంటుంది.
Also Read: Aadhaar Update: 10 రోజుల్లో బంద్ కాబోతున్న ఆధార్ ఉచిత సర్వీస్.!
ఈ శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 5000 భారీ బ్యాటరీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను చాలా వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile