Realme P1 5G: 15 వేల బడ్జెట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో వచ్చింది.!

Realme P1 5G: 15 వేల బడ్జెట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో వచ్చింది.!
HIGHLIGHTS

రియల్ మి ఈరోజు P1 series నుండి రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది

రియల్ మి పి1 5G స్మార్ట్ ఫోన్ ను 15 వేల బడ్జెట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో తీసుకు వచ్చింది

రియల్ మి ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది

Realme P1 5G: రియల్ మి ఈరోజు P1 series నుండి రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటిలో బేసిక్ ఫోన్ రియల్ మి పి1 5G స్మార్ట్ ఫోన్ ను 15 వేల బడ్జెట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ డిజైన్, కొత్త కలర్ ఆప్షన్ మరియు ఈ బడ్జెట్ లో ఆకట్టుకునే ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. రియల్ మి ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ పైన ఒక లుక్కేయండి.

Realme P1 5G: Price

రియల్ మి ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 6GB+128GB వేరియంట్ రూ. 15,999 ధరతో మరియు 8GB+256GB వేరియంట్ ను రూ. 18,999 ధరకు పొందవచ్చు. అయితే, ఈ ఫోన్ల పైన అందించిన లాంఛ్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకోవచ్చు.

ఆఫర్లు:

Realme P1 5G Early Bird Sale
Realme P1 5G Early Bird Sale

ఈ ఫోన్ పైన రూ. 2,000 వరకూ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అర్లీ బర్ద్ సేల్ నుండి ఈరోజే ఈ ఫోన్ ను సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ ఫోన్ యొక్క అర్లీ బర్ద్ సేల్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.

Also Read: Split AC Deals: భారీ ఆఫర్లతో 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ ఏసీలు ఇవే.!

Realme P1 5G: ప్రత్యేకతలు

రియల్ మి పి1 5జి ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB అధనపు ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Samsung S5KJN1) మెయిన్ + 2MP మోనో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మి కొత్త ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

రియల్ మి పి1 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 45W SUPERVOOC ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పెద్ద 7 లేయర్ Vapour Chamber Cooling System వుంది. ఇది ఈ ఫోన్ ను చాలా వేగంగా చల్లబరుస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo