రియల్మి కొత్త సిరీస్ నుండి రానున్న NARZO 10 మరియు NARZO 10A : ఇవే స్పెక్స్

రియల్మి కొత్త సిరీస్ నుండి రానున్న NARZO 10 మరియు NARZO 10A : ఇవే స్పెక్స్
HIGHLIGHTS

ఈ రెండు ఫోన్ల ప్రారంభ తేదీని మార్చి 26 గా కంపెనీ ప్రకటించింది.

రియల్మి నుండి రానున్న కొత్త సిరీస్‌ లో భాగంగా, దాని రెండు కొత్త మొబైల్ ఫోన్లను మార్చి 26 న భారతదేశంలో విడుదల చేయబోతున్నారు. ఈ సిరీస్‌లో రియల్మి నార్జో 10 స్మార్ట్‌ ఫోన్ను నార్జో 10 A తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో 10 గురించి మాట్లాడితే, మీరు అందులో హెలియో జి 80 చిప్‌ సెట్‌ను, అలాగే  క్వాడ్-కెమెరా సెటప్‌ తో పాటుగా 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా అందుకోనున్నారు. ఇది ఇప్పుడు రియల్మి ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా వస్తోంది.ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ ద్వారా, ఈ రెండు ఫోన్ల ప్రారంభ తేదీని మార్చి 26 గా కంపెనీ ప్రకటించింది. దీన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించనున్నారు.

మీరు ఈ ఫోనులో ఒక 6.5-అంగుళాల స్క్రీన్నుఒక 89.8% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఇవ్వనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీనితో పాటు, ఒక పెద్ద 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా అందుకుంటారు. ఈ నార్జో 10 ఇటీవల మయన్మార్ మార్కెట్లో విడుదల చేసిన రియల్మే 6i యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా చెబుతున్నారు.

ఇది కాకుండా, మేము నార్జో 10A గురించి మాట్లాడితే, ఇది దాదాపు ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయిన రియల్మే c3 లాగా కనిపిస్తుంది. అనేక కొత్త ఫీచర్లతో కూడిన రియల్మి సి 3 యొక్క వేరే వెర్షన్ భారతదేశంలో లాంచ్ అవుతోందని కూడా చెప్పవచ్చు. ఈ మొబైల్ ఫోనులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా చూపిస్తోంది.

ఇక ఇటీవల ప్రారంభించిన రియల్మి 6i స్మార్ట్‌ఫోన్‌ గురించి చర్చిస్తే, ఈ మొబైల్ ఫోనులో రియల్మిUI లో ఆండ్రాయిడ్ 10 తో పాటుగా డ్యూయల్ సిమ్‌ తో వచ్చింది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 20: 9 యొక్కఆస్పెక్ట్ రేషియా గల  ఒక 6.5-అంగుళాల FHD స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌ కు మీడియాటెక్ హెలియో జి 80 SoC  శక్తినిస్తుంది. మాలి జి 52 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) గ్రాఫిక్స్ కోసం ఈ ఫోనులో ఉంచబడింది. ఈ ఫోనులో 3 జీబీ మరియు 4 జీబీ ర్యామ్ ఉంది.

కెమెరా గురించి మాట్లాడితే, ఈ రియల్మి 6i లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది మరియు ఇది  f / 1.8 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ లభిస్తుంది. ముందు కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోనుకు ముందు 16 మెగాపిక్సెల్ షూటర్ లభిస్తుంది, ఇది ఎపర్చరు ఎఫ్ / 2.0 కలిగి ఉంటుంది మరియు వాటర్ డ్రాప్ నోచ్ లో ఉంటుంది. ఇది 64 జిబి మరియు 128 జిబి వంటి రెండు  స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది  మరియు మైక్రో ఎస్డి కార్డుతో 256 జిబి వరకూ పెంచవచ్చు. కనెక్టివిటీ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందించబడ్డాయి.

Realme 6i లో 5,000WAh బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ యొక్క కొలత 164.40×75.40×9.00 మిమీ మరియు దీని బరువు 195 గ్రాములు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo