Realme Narzo 70 Pro: పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది.!

Realme Narzo 70 Pro: పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది.!
HIGHLIGHTS

ఈరోజు ఇండియాలో Realme Narzo 70 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ కొత్త ఫోన్ పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది

ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Realme Narzo 70 Pro: రియల్ మి ఈరోజు ఇండియాలో రియల్ మి నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది. కేవలం ఈ రెండు వివరాలు మాత్రమే కాకుండా డిజైన్ మొదలుకొని స్పెక్స్ పరంగా ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా రియల్ మి టీజింగ్ చేస్తున్న ఈ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme Narzo 70 Pro: Price

రియల్ మి నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 19,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 21,999 ధరతో లాంఛ్ చేసింది.

ఆఫర్స్

ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి బేసిక్ వేరియంట్ పైన రూ. 1,000 రూపాయలు మరియు హాఎండ్ వేరియంట్ పైన రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈరోజు సాయంత్రం 6 గంటకు జరగనున్న ఆర్లి బర్డ్ సేల్ నుండి ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,999 విలువైన T300 ఇయర్ బడ్స్ ఉచితంగా అందుకోవచ్చని చెబుతోంది.

Also Read: Air Coolers: అమేజాన్ పైన లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ కూలర్ ఆఫర్స్.!

Realme Narzo 70 Pro: స్పెక్స్ & ఫీచర్స్

రియల్ మి నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ పెద్ద డిస్ప్లేతో వచ్చింది. ఇది 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7050 5G ప్రోసెసర్ తో లాంఛ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 8GB RAM + 8GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ ను మరియు 256GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జత చేసింది.

Realme Narzo 70 Pro Features
Realme Narzo 70 Pro Features

ఈ ఫోన్ లో కొత్త Air Gestures ఫీచర్ ను కూడా రియల్ మి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ తో చేతి సంజ్ఞల తోనే ఫోన్ ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ Realme UI 5.0 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో వస్తుంది. ఈ ఫోన్ లో 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 500 mAh బిహ బ్యాటరీ కూడా వుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఇందులో 50MP (sonyIMX890) OIS మెయిన్ కెమేరా వుంది. దీనికి జతగా మరో రెండు కెమేరా వున్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo