realme launching Realme C100x with 8000mah big battery on tomorrow
Realme C100x: రియల్‌మీ నార్ జో సిరీస్ నుంచి 100x ఫోన్ లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేసిన రియల్‌మీ, బడ్జెట్ సిరీస్ అయిన C సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న C100x ఫోన్ కోసం మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేస్తోంది. బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ను 8000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది.
రియల్‌మీ సి 100x స్మార్ట్ ఫోన్ జూలై 16వ తేదీ అంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేయబడుతోంది మరియు లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది.
రియల్‌మీ సి 100x స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు ఆర్మోర్ సెల్ ప్రొటక్షన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్మూత్ స్క్రోల్ అండ్ గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు కలిగిన బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే రైన్ టచ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12GB డైనమిక్ ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా రియల్‌మీ అందించింది. ఈ ఫోన్ లో Gemini Ai ని యాక్సెస్ చేయడానికి డైనమిక్ బటన్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 8000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కోడోత్ ఈ ఫోన్ లో కంపెనీ అందించింది.
Also Read: Vivo T5 Lite: రేపు లాంచ్ కాబోతున్న వివో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.!
ఈ ఫోన్ ను గోల్డెన్ కోస్ట్ మరియు డీప్ బ్లూ టైడ్ రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసి లాంచ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.