Vivo T5 Lite: రేపు లాంచ్ కాబోతున్న వివో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.!
వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో టి5 లైట్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ ను కంపెనీ ముందే రివీల్ చేసింది
ఈ ఫోన్ అంచనా ప్రైస్ ను కూడా ఒకసారి పరిశీలిద్దాం
Vivo T5 Lite: వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో టి5 లైట్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ ను కంపెనీ ముందే రివీల్ చేసింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, గొప్ప డిజైన్ మరియు జబర్దస్త్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రేపు లాంచ్ కాబోతున్న వివో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి. ఆంతేకాదు, ఈ ఫోన్ అంచనా ప్రైస్ ను కూడా ఒకసారి పరిశీలిద్దాం.
SurveyVivo T5 Lite: టాప్ 5 ఫీచర్స్
డిజైన్
వివో టి 5 లైట్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ యాంటీ డ్రాప్ సర్టిఫికేషన్ కలిగిన దృఢమైన డిజైన్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది MIL-STD 810 H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP65 వాటర్ అదనపు డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
డిస్ప్లే
ఈ వివో ఫోన్ లేటెస్ట్ ఫోన్ TUV Rheinland ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కలిగిన కలిగిన 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో బ్రైటెస్ట్ డిస్ప్లే కలిగిన ఫోన్ ఇట్టి అవుతుందని వివో తెలిపింది.
కెమెరా
ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ఇది లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

బ్యాటరీ
ఈ వివో కొత్త ఫోన్ 6500 mAh బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ తో ఈ ఫోన్ 48 గంటల వీడియో ప్లే బ్యాక్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ లేదా 12 గంటల గేమ్ ప్లే లేదా 54 గంటల కంటే అధిక సమయం వాయిస్ కాల్ బ్యాకప్ అందిస్తుందని వివో పేర్కొంది.
కలర్ అండ్ OS
వివో ఈ ఫోన్ ను ఫోన్ ను వేవ్ బ్లూ మరియు ట్విలైట్ షాడో రెండు కలర్ ఎంపికలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Color OS సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అవుతుంది.
Also Read: iPhone 18 Release Date ఎప్పుడు అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.!
Vivo T5 Lite: అంచనా ప్రైస్
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 12,999 నుంచి రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
