Realme C100x: బడ్జెట్ సిరీస్ నుంచి 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!

HIGHLIGHTS

Realme C100x ఫోన్ ను ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ ను 8000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది

Realme C100x: బడ్జెట్ సిరీస్ నుంచి 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!

Realme C100x: రియల్‌మీ నార్ జో సిరీస్ నుంచి 100x ఫోన్ లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేసిన రియల్‌మీ, బడ్జెట్ సిరీస్ అయిన C సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న C100x ఫోన్ కోసం మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేస్తోంది. బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ను 8000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C100x: లాంచ్ డేట్

రియల్‌మీ సి 100x స్మార్ట్ ఫోన్ జూలై 16వ తేదీ అంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేయబడుతోంది మరియు లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది.

Realme C100x: ఫీచర్స్

రియల్‌మీ సి 100x స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు ఆర్మోర్ సెల్ ప్రొటక్షన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్మూత్ స్క్రోల్ అండ్ గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు కలిగిన బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే రైన్ టచ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12GB డైనమిక్ ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Realme C100x

ఈ ఫోన్ లో వెనుక 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా రియల్‌మీ అందించింది. ఈ ఫోన్ లో Gemini Ai ని యాక్సెస్ చేయడానికి డైనమిక్ బటన్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 8000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కోడోత్ ఈ ఫోన్ లో కంపెనీ అందించింది.

Also Read: Vivo T5 Lite: రేపు లాంచ్ కాబోతున్న వివో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.!

ఈ ఫోన్ ను గోల్డెన్ కోస్ట్ మరియు డీప్ బ్లూ టైడ్ రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసి లాంచ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile