Realme C100i సైలెంట్ గా లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Realme C100i స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో చాలా సైలెంట్ గా విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ గా అందించింది

ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ సేల్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది

Realme C100i స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో చాలా సైలెంట్ గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ గా అందించింది. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న స్మార్ట్ ఫోన్ ధరల ట్రెండ్ తో పోలిస్తే, ఇది నిజమే అవుతుంది. అయితే, 2025 లో ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్రెండ్ తో పోలిస్తే, ఈ ఫోన్ అధిక ధరలో వచ్చినట్లు చూడొచ్చు. ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ సేల్ కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది.

Realme C100i: ప్రైస్

రియల్ మీ ఈ ఫోన్ ను కేవలం 4 జీబీ + 64జీబీ సింగిల్ వేరియంట్ తో రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సిల్వర్ స్కై మరియు మిడ్ నైట్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు సైలెంట్ గా లాంచ్ చేయడమే కాకుండా ఈ రోజు నుంచే ఫోన్ సేల్ కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ పై లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ అఫీషియల్ సైట్ మరియు రిటైల్ స్టోర్ నుంచి సేల్ అవుతుంది.

ఈ ఫోన్ పై ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ Axis అండ్ ఫ్లిప్ కార్ట్ SBI మరియు RBL కార్డ్ ఆప్షన్ పైన కూడా రూ. 750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.

Also Read: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో POCO M8x 5G ఫస్ట్ డే సేల్ స్టార్ట్ అయ్యింది .. ఈ డీల్ మిస్ చేసుకోకండి.!

Realme C100i: ఫీచర్స్

రియల్ మీ ఈ ఫోన్ ను లేటెస్ట్ అండ్ ప్రీమియం డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబులిటీ సెటప్ తో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, ఐ కంఫర్ట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఇది రియల్ మీ అందించిన 4జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. అలాగే, ఇది 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 8MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్, రియల్ మీ కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే 6500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.

ఈ ఫోన్ లో 300% అల్ట్రా వాల్యూమ్ అందించే స్పీకర్ ని అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ రైన్ టచ్ మోడ్, స్పీకర్ క్లీనర్ తో పాటు IP 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :