Realme Narzo 10A కొత్త వేరియంట్ విడుదల చేసిన రియల్మి

HIGHLIGHTS

Realme Narzo 10A యొక్క కొత్త వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి.

Realme Narzo 10A కొత్త మోడల్ ను Rs. 9,999 రూపాయల ధరతో ప్రకటించింది.

Realme Narzo 10A కొత్త వేరియంట్ విడుదల చేసిన రియల్మి

రియల్‌మి ఇటీవల తన బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ Realme Narzo 10A ను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ను  Rs. 9,999 రూపాయల ధరతో ప్రకటించింది. రియల్‌మి నార్జో 10 ఎ యొక్క 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .8,499. ఈ కొత్త వేరియంట్ సో వైట్ మరియు సో బ్లూ రంగులలో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 10A యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్లు రియల్మే యొక్క వెబ్‌సైట్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్త వేరియంట్ నిన్న మధ్యాహ్నం 12 నుండి అమ్మకానికి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో లభిస్తుంది.

Realme Narzo 10A స్పెక్స్

ఎంట్రీ లెవల్ నార్జో 10A మాట్టే ఫినిష్ తో వస్తుంది మరియు బ్లూ మరియు తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్‌ప్లే తో ఫోన్‌ను లాంచ్ చేశారు మరియు ఈ ఫోన్ను వాటర్ డ్రాప్ నోచ్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకువచ్చారు. ఈ ఫోనుకు కూడా గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది.

Realme Narzo 10A మీడియాటెక్ హెలియో జి 70 చిప్‌సెట్ తో పనిచేస్తుంది, ఇది మాలి-జి 52 గ్రాఫిక్‌ లతో జత చేసిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి,దీనిని ఒక డేడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డుతో 256 జీబీ వరకు పెంచవచ్చు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన RealmeUI లో పరికరం పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ఇది  f / 1.8 ఎపర్చరు గల 12MP ప్రాధమిక కెమెరాను మరియు మరో రెండు కెమెరాల్లో ఒక 2MP మాక్రో మరియు డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. AI బ్యూటీఫికేషన్‌తో వచ్చిన ఈ ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. నార్జో 10A 5,000WAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile