Realme GT 7 Pro: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు గొప్ప డిజైన్ అవుతోంది.!

HIGHLIGHTS

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ప్రకటించింది

ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది

ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ ను మొదలు పెట్టింది

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ నెలలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

Realme GT 7 Pro : లాంచ్

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ GT 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను నవంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ యొక్క ఖచ్చితమైన లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ ను మాత్రం మొదలు పెట్టింది.

రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసిం. చిప్ సెట్ తో ఇండియాలో విడుదల అవుతున్న మొదటి ఫోన్ ఇదే అవుతుంది, అని రియల్ మీ తెలిపింది. వాస్తవానికి, ఈ చిప్ సెట్ తో ఇప్పటికే చైనా మార్కెట్ లో iQOO 13 మరియు OnePlus 13 ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ మార్స్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ యొక్క రెండు కలర్ వేరియంట్లను రియల్ మీ టీజింగ్ చేస్తోంది.

ఈ ఫోన్ ను మార్స్ డిజైన్ మరియు గెలాక్సీ గ్రే రెండు కలర్ వేరియంట్లలో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా కనిపిస్తోంది మరియు ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది మరియు ఇది HyperImage + ఫీచర్ తో ఉంటుంది.

Also Read: OnePlus 13 Launched: వన్ ప్లస్ కొత్త ఫోన్ 24GB ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ తో లాంచ్.!

ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ ద్వారా ఈ ఫోన్ హెవీ ర్యామ్ మరియు హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుండే అవకాశం వుంది. అంతేకాదు, కెమెరా పరంగా కూడా గొప్ప ఫీచర్స్ మరియు సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కోసం అందించే మరిన్ని టీజర్స్ ద్వారా ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :