Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో జరగనున్నది.!
Realme GT 7 Pro మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది
ఈ ఫోన్ ను ఫాస్ట్ ప్రోసెసర్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో విడుదల చేసింది.
ఈ ఫోన్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్
Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ వారం ప్రారంభంలో మొదలైన ఈ రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ భారీ ఆఫర్లతో అందించింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ కంటే ముందు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.
SurveyRealme GT 7 Pro : ప్రైస్
రియల్ మీ GT 7 ప్రో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ రెండు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
రియల్ మీ GT 7 ప్రో (12GB + 256GB) ధర : రూ. 59,999
రియల్ మీ GT 7 ప్రో (16GB + 512GB) ధర : రూ. 65,999
ఈ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, Mi Stores మరియు mi.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్ :
ఈ ఫోన్ పై All Banks Card ట్రాన్సాక్షన్ రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ ఏ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసినా రూ. 3,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ పై 12 నెలల No Cost EMI ఆప్షన్ ను కూడా అందించింది.
Also Read: మీ మొబైల్ ఫోన్ లోనే Aadhaar address చేంజ్ చేసుకోవచ్చు.. అది కూడా ఉచితంగా.!
Realme GT 7 Pro : ఫీచర్స్
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద క్వాడ్ కర్వ్డ్ Eco² OLED స్ఖఫ్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ Sony ట్రిపుల్ ఫ్లాగ్ షిప్ కెమెరా సిస్టం ను కలిగి వుంది. ఇందులో 50MP Sony మెయిన్, 50MP Sony పెరిస్కోప్ పోర్ట్రైట్ సెన్సార్ మరియు 8MP కెమెరా వున్నాయి. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ కెపాసిటీతో వస్తుంది. ఈ ఫోన్ లో 120 W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,800 mAh బ్యాటరీ వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile