Realme C67 5G: ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్లీక్ డిజైన్ తో వస్తోంది.!

HIGHLIGHTS

రియల్ మి ఇండియా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చెయ్యబడింది

C సిరీస్ నుండి Realme C67 5G ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది

రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వస్తోంది

Realme C67 5G: ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్లీక్ డిజైన్ తో వస్తోంది.!

రియల్ మి ఇండియా నుండి కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చెయ్యబడింది. రియల్ మి యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన C సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదే, Realme C67 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క టీజర్ ను కూడా రియల్ మి విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme C67 5G

రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకంగా సేల్ అవుతుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ పేజ్ నుండి రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ మరియు కొన్ని ప్రత్యేకతలను కూడా వెల్లడించింది.

Realme C67 5G launching with 33w supervooc charging
రియల్ మి సి67 5జి

ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మి అధికారిక పేజ్ నుండి అందించింది వివరాల ప్రకారం, రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.9mm అల్ట్రా స్లిమ్ బాడీ తో ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా సన్నని అంచులతో కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో స్పార్క్లింగ్ లెన్స్ రింగ్ ఉన్నట్లు కూడా రియల్ మి చెబుతోంది.

Also Read : Lava Agni 2 5G పైన ధమాకా ఆఫర్ ప్రకటించిన అమేజాన్.!

ఈ ఫోన్ ను 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో కూడా తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వివరాలతో పాటుగా ఈ ఫోన్ కలిగి ఉండనున్న రెండు టాప్ ప్రత్యేకతల గురించి కూడా రియల్ మి తెలిపింది. అదేమిటంటే, ఈ ఫోన్ ఈ ధర సెగ్మెంట్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన ఫోన్ అవుతుంది మరియు ఈ క్లాస్ కేటగిరిలో అతి సన్నని ఫోన్ కూడా అవుతుంది.

ఇక ఈ ఫోన్ యొక్క ఇమేజీల ద్వారా ఈ ఫోన్ లో టైప్ – C పోర్ట్, 3.5mm జాక్ సపోర్ట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన డిస్ప్లే వస్తుందని మనం అర్ధం చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo