108MP కెమేరాతో రేపు లాంచ్ అవబోతున్న Realme C53

HIGHLIGHTS

Realme C53 రేపు లాంచ్ అవుతోంది

మినీ కాప్స్యూల్ ఫీచర్ తో లాంచ్ చేయడానికి రియల్ మి సిద్దమయ్యింది

ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో వస్తోంది

రియల్ మి ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme C53 రేపు లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 108MP డ్యూయల్ కెమేరా, ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో పాటుగా మినీ కాప్స్యూల్ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడానికి రియల్ మి సిద్దమయ్యింది. రేపు ఇండియాలో విడుదకాబోతున్న ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.

Realme C53: టీజ్డ్ స్పెక్స్

రియల్ మి ఈ ఫోన్ లాంచ్ కోసం అందించి టీజింగ్ పేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన వివరాలను ప్రకటించింది. రియల్ మి C53 స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా ఐఫోన్ 13 ప్రో లో కనిపించే మూడు కెమేరాల సెటప్ మాదిరిగా కనిపించేలా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ని అందించింది. ఇందులో 108MP కెమేరా ఉన్నట్లు కంపెనీ టీజింగ్ ద్వారా తెలిపింది. 

ఈ ఫోన్ లో అందించిన కెమేరాతో చిత్రీకరించిన శాంపిల్ ఇమేజ్ లను కూడా కంపెనీ టీజర్ లో జత చేసింది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. C53 స్మార్ట్ ఫోన్ 7.99 మందంతో చాలా సన్నని డిజైన్ ఉన్నట్లు కూడా కంపెనీ సూచించింది. 

 

https://twitter.com/realmeIndia/status/1681191556026621954?ref_src=twsrc%5Etfw

 

ఈ ఫోన్ లో అందించిన మరొక ఫీచర్ ను కూడా కంపెనీ చెప్పకనే చెప్పింది. ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఇందులో 'Mini Capsule' ఫీచర్ ఉన్నట్లు కూడా అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబడిందని రియల్ మి ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :