Realme C51 First Sale: 9 వేల ధరలో 8GB RAM ఫోన్ మొదటిసారి సేల్ కి వస్తోంది.!

HIGHLIGHTS

Realme లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C51 యొక్క First Sale మొదలవనున్నది

తక్కువ ధరలో 8GB వరకూ Dynamic RAM ఫోన్

ప్రమియం లుక్ మరియు ఈ ధరలో ఆకట్టుకునే మరిన్ని ఫీచర్స్ తో లాంచ్

Realme లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C51 యొక్క First Sale మొదలవనున్నది. 9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో 8GB వరకూ Dynamic RAM ఫీచర్ తో ఈ ఫోన్ ను రియల్ మి అందించింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ప్రీమియం లుక్ మరియు ఈ ధరలో ఆకట్టుకునే మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 11వ తేది మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారి సేల్ కి వస్తుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క Specisl Sale మాత్రం ముందుగానే నిర్వహించింది రియల్ మి. 

Realme C51 Sale: Price & Offers

ఈ రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రూ. 8,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను మీరు సెప్టెంబర్ 11 వ తేదీ Flipkart మరియు realme.com నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పైన Realme లాంచ్ అఫర్ లను కూడా అందించింది. 

ఏమిటి ఈ Realme C51 ప్రత్యేకతలు?

Realme C51  స్మార్ట్ ఫోన్ లో ఈ బడ్జెట్ ధరలో ఆకర్షించే ఫీచర్లనే కలిగి వుంది. రియల్ మి సి 51 స్మార్ట్ ఫోన్ మంచి ఆకర్షణీయమైన గ్లాసీ మరియు స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ పెద్ద 90Hz రిఫ్రెష్ రేట్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ను ప్రీమియం గా కనిపించేలా చేసే Mini Capsule ఫీచర్ ను కూడా రియల్ మీ ఈ ఫోన్ లో జత చేసింది.  

ఈ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో అందించినా ఫోన్ మరింత వేగంగా పని చేయడానికి వీలుగా 4GB RAM + 4GB RAM డైనమిక్ ర్యామ్ తో హెవీ 8GB RAM ఫీచర్ మరియు 64GB +  64GB Boosted స్టోరేజ్ తో మరింత స్టోరేజ్ అఫర్ చేస్తుంది. అంటే, ఈ ఫోన్ ను మరింత వేగంగా పని చేయడానికి ఈ చారలు తీసుకుంది. 

ఈ ఫోన్ లో ఈ బడ్జెట్ లో సమంజసమైన 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాని కూడా అందించింది మరియు ముందు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఎక్కువ సమయం ఫోన్ పని చేయడానికి వీలుగా బిగ్ 5000 mAh బ్యాటరీని వేగంగా ఛార్జ్ చెయ్యడానికి వీలుగా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా రియల్ మీ ఈ ఫోన్ లో అందించింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :