108MP కెమెరాతో Realme 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

HIGHLIGHTS

Realme 8 Series లాంచ్ డేట్ ఫిక్స్

మీడియా ఆహ్వానంలో 108MP కెమెరా గురించి టీజ్

108MP కెమెరాతో Realme 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

Realme తన 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. మార్చి 24 న రియల్మీ 8 సిరీస్ నుండి రియల్మీ 8 మరియు 8 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ కార్యక్రమానికి సంభందించి పంపిన మీడియా ఆహ్వానంలో 108MP కెమెరా గురించి టీజ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 రియల్మీ 8 సిరీస్ గురించి ఇప్పటికే చాలా రూమర్లు మరియు లీక్స్ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. అయితే, అధికారిక ప్రకటన ద్వారా 108MP కెమెరాతో ఈ ఫోన్లను తీసుకొస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. అలాగే, రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియో ద్వారా రియల్మీ 8 స్మార్ట్ ఫోన్ లో 64MP మైన్ కెమెరా మరియు రియల్మీ 8 ప్రో ఫోన్ లో 108MP ప్రధాన కెమెరా సెటప్పుతో వుంటుందని అర్ధమవుతోంది.

ఇక ఈ ఫోన్ల గురించి ముందుగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, రియల్మీ 8 ఒక 6.4 అంగుళాల AMOLED ప్యానల్ తో, 64ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ మరియు మీడియా టెక్ హీలియో G95 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే, పెద్ద 5000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువస్తుందని చెప్పబడుతోంది.

అయితే, 8 ప్రో మోడల్ మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన పెద్ద సూపర్ AMOLED స్క్రీన్  108MP కెమెరా స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ మరియు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు.                                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo