Realme 70 Turbo 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ పవర్ ఫుల్ 5జి ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

Realme 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ బడ్జెట్ ఫోన్ గా కూడా చూడవచ్చు

గొప్ప కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది

Realme 70 Turbo 5G: రియల్ మీ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ రియల్ మీ 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ బడ్జెట్ ఫోన్ గా కూడా చూడవచ్చు. ఎందుకంటే, 15 వేల బడ్జెట్ ధరలో ఈ ఫోన్ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, దీపావళి 2024 పండుగ వరకు అందుబాటులో ఉండే గొప్ప కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఈ లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది.

Realme 70 Turbo 5G: ధర

రియల్ మీ 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో అందించింది. ఇందులో 6GB + 128GB వేరియంట్ ను రూ. 16,999 ధరతో, 8GB + 128GB వేరియంట్ ను రూ. 17,999 ధరతో మరియు హై ఎండ్ 12GB+ 256GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్

ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్స్ ను కూడా రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. ఈ ఆఫర్ కేవలం దీపావళి 2024 పండుగ వరకు ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ realme.com మరియు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తుంది.

Also Read: POCO X6 Neo 5G పై భారీ తగ్గింపు ఆఫర్: ఇప్పుడు రూ. 12,999 ధరకే లభిస్తోంది.!

Realme 70 Turbo 5G: ఫీచర్స్

రియల్ మీ 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో Dimensity 7300 Energy 5G చిప్ సెట్ వుంది మరియు దీనికి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 14GB డైనమిక్ ర్యామ్ వుంది. ఈ ఫోన్ లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి పెర్ఫార్మన్స్ మరియు అధిక స్టోరేజ్ ను ఆఫర్ చేస్తుందని రియల్ మీ తెలిపింది.

ఈ రియల్ మీ కొత్త ఫోన్ లో 6.67 ఇంచ్ FHD+ OLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు రైన్ స్మార్ట్ టచ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 30fps వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :