Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గ్రేట్ డీల్ గా వచ్చింది.!

HIGHLIGHTS

Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గ్రేట్ డీల్ గా వచ్చింది

జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో మంచి బెస్ట్ ప్రీమియం ఫోన్ గా కొనసాగుతోంది

పండుగ డిస్కౌంట్ ఆఫర్ వస్తే కొనడానికి చాలా మంది మక్కువ చూపుతారు

Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గ్రేట్ డీల్ గా వచ్చింది. శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫోన్ జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో మంచి బెస్ట్ ప్రీమియం ఫోన్ గా కొనసాగుతోంది. ఈ ఫోన్ ప్రీమియం ప్రైస్ తో సేల్ అవుతోంది కాబట్టి, పండుగ డిస్కౌంట్ ఆఫర్ వస్తే కొనడానికి చాలా మంది మక్కువ చూపుతారు. మీరు కూడా అలా ఎదురు చూసే వారిలో మీరు కూడా ఉంటే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్.

Samsung Galaxy S25 Ultra : డీల్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఇండియన్ మార్కెట్లో రూ. 1,29,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు కూడా ఈ ఫోన్ రూ. 99,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించే ఆఫర్స్ తో కేవలం రూ. 84,999 డిస్కౌంట్ ధరలో లభిస్తుందని అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది.

అంటే, ఈ ఫోన్ ఈరోజు సేల్ అవుతున్న ప్రైస్ కంటే కూడా రూ. 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రైస్ తో అమెజాన్ సేల్ నుంచి మీకు లభిస్తుంది. ఇది శాంసంగ్ అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ప్రైస్ లో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. గత సేల్ నుంచి కూడా ఈ ఫోన్ దాదాపు ఇదే డిస్కౌంట్ ప్రైస్ లో లభించింది. అయితే, సేల్ తర్వాత మొబైల్ రేట్లు పెరగడం జరిగింది. అయినా కూడా ఈ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి అదే ఆఫర్ ప్రైస్ లో లభించడం అంటే, ఇది పరిశీలించ దగిన డీల్ అవుతుంది.

Also Read: రేట్లు పెరిగినా తగ్గేదే లే అంటున్న ఫ్లిప్ కార్ట్ .. 5 వేలకే Washing Machine సేల్ చేస్తోంది.!

Samsung Galaxy S25 Ultra : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రీమియం మెటల్ బాడీ మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేని QHD+ (3120 × 1440) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. HDR10+ సపోర్ట్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ మరియు 1–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ మరియు 12 జీబీ ర్యామ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ఫోన్ లో జబర్దస్త్ కెమెరా సెటప్ ఉంది. అదేమిటంటే, 200MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో మరియు 10MP టెలిఫోటో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ మరియు జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ S పెన్ సపోర్ట్ తో పాటు భారీ 5000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :