tvs fridge ac and washing machine price hike started
Price Hike: దసరా పండుగ సీజన్ మొదలైందని ఆనందపడాలో లేక పెరిగిన ధరలతో జేబుకు చిల్లు పడుతుందని బాధపడాలో అర్థం కాని అయోమయంలో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. దేశమంతటా చాలా వస్తువుల ధరలు పెరగడంతో పాటు హోటల్ లో ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి పెరిగాయి. ముఖ్యంగా, 2026 అక్టోబర్ 1 నుంచి రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండిషనర్లు (AC) మరియు టెలివిజన్ వంటి చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగడంతో సామాన్యుల జేబుకు జేబుకు చిల్లు పడటం నిశ్చయం అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఇప్పటి వరకు ధరల పెరుగుదలలో ప్రభుత్వ టాక్స్ ప్రధాన కారణం అయితే, ఈసారి మాత్రం ఆ వస్తువులు తయారు చేసే కంపెనీలు పెంచడం జరిగింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముడిసరుకుల రేట్లు మరియు రవాణా ఖర్చులు భారంగా మారాయి. అయితే, మార్కెట్ లో నడుస్తున్న పోటీ తత్వం మరియు తమ సేల్స్ ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వస్తవులను బడ్జెట్ ధరలోనే ఆఫర్ చేస్తూ వచ్చాయి. అయితే, ఇక నుంచి అలా చేయడం సాధ్యం కాదని గమనించిన కంపెనీలు వాటి ప్రొడక్ట్స్ రేట్లు పెంచాయి.
ముఖ్యమైన రీజన్స్ ను పరిగణనలోకి తీసుకుని తయారీ కంపెనీలు ధరలు సవరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్ AC, రిఫ్రిజిరేటర్, LED TV లు మరియు మరికొన్ని వస్తువుల రేట్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
రేట్లు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదేమిటంటే, పాత స్టాక్ పై కొత్త రేట్లు జత చేయబోమని కంపెనీలు తెలిపాయి. స్టాక్ హోల్డర్ ఈ విషయాన్ని యెంత వరకు అమలు చేస్తారు అనేది అసలైన చిక్కుముడి.
కాదు, అన్ని ప్రొడక్ట్స్ రేట్లు పెరగడం ఒకే విధంగా ఉండదు. అంటే, అక్టోబర్ 1, 2026 నుంచి ప్రతి టీవీ, వాషింగ్ మెషిన్ మరియు ఫ్రిడ్జ్ రేట్లు ఒకే విధంగా పెరగలేదు. బ్రాండ్, మోడల్ మరియు స్టాక్ ఆధారంగా వీటి ధరలలో మార్పు ఉంటుంది. అయితే, AC విషయంలో పెరుగుదల మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Price Hike తర్వాత కూడా కేవలం 24 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv
అవును, చాలా ఏసీ తయారీ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి వాటి ఏసీ రేట్లు పెంచినట్లు ప్రకటించాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఏ కంపెనీ ఎంత శాతం రేట్లు పెంచారు అనే లిస్ట్ ఇక్కడ ఉంది.
అయితే, ఇతర కంపెనీల ఏసీ రేట్లు పెంచిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ రేట్లు పెరిగదల గురించి మీకు అర్ధం అయ్యేలా చేయడానికి ప్రైస్ లిస్ట్ తో ఉదాహరణ వివరాలు ఇక్కడ అందించాము.
పైన అందించిన వివరాల ప్రకారం మీరు ఇప్పుడు కొనుగోలు చేసే కొత్త ఏసీ పై కొనుగోలు భారం ఎంత పడుతుందో అర్థం అయ్యే ఉంటుంది. అయితే, టీవీ, ఫ్రిడ్జ్ మరియు వాషింగ్ మెషిన్ పై కచ్చితమైన ప్రైస్ హైక్ లిస్ట్ ఇంకా రివీల్ కాలేదు.
గమనిక : మెయిన్ ఇమేజ్ లో చూపించిన ప్రైస్ కేవలం అవగాహన కోసం మాత్రమే అని గమనించాలి. ఇవి నిజమైన రేట్లు కావని మనవి.