Price Hike తర్వాత కూడా కేవలం 24 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv

HIGHLIGHTS

Price Hike తర్వాత కూడా కేవలం 24 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv

అక్టోబర్ 1 నుంచి టీవీలతో పాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ రేట్లు పెరిగాయి

కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పటికీ పాత ధరకే అమ్ముడవుతున్నాయి

Price Hike తర్వాత కూడా కేవలం 24 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv గురించి మీకు తెలుసా? అవును, అక్టోబర్ 1 నుంచి టీవీలతో పాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటి మరిన్ని హోం అప్లయెన్సెస్ ప్రొడక్ట్స్ పైన రేటు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పటికీ పాత ధరకే అమ్ముడవుతున్నాయి. అటువంటి ఒక టీవీ డీల్ ఈరోజు మీ ముందుకు తీసుకు వచ్చాను. ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Price Hike తర్వాత లభిస్తున్న 55 ఇంచ్ 4K Smart Tv డీల్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Coocaa గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన Y74 Plus సిరీస్ 55 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు బెస్ట్ ఆఫర్ ధరల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 26,999 ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీని ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుటి కొనే వారికి రూ. 2,400 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 24,599 రూపాయల అఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి .. బిగ్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

55 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్

ఈ కుకా స్మార్ట్ టీవీ 55 అంగుళాల పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, గొప్ప బ్రైట్నెస్ మరియు HLG వంటి ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో మరింత అందంగా కూడా ఉంటుంది.

ఈ టీవీ మొత్తం రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది మరియు బెల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఆప్టికల్ ఇన్, ఈతర్నెట్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉంటాయి. ఈ టీవీ కళ్ళకు హాని కలిగించని ఐ కేర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

మొత్తానికి, రేట్లు పెరిగిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ పుణ్యమా అని ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇప్పటికీ అందుబాటు ధరలోనే లభిస్తోంది. అయితే, ఈ లభ్యత కేవలం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :