Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి .. బిగ్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ యొక్క అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని ఇప్పుడు రివిల్ చేసింది
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి
ఫ్లిప్ కార్ట్ నమ్మశక్యం కాని డీల్ ని ఈరోజు రివీల్ చేసింది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ యొక్క అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని ఇప్పుడు రివిల్ చేసింది. సాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్ సిరీస్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 ఫోన్ ని ఆల్ టైం చవక ధరలో అందుకోండి, అని ఫ్లిప్ కార్ట్ డీల్ అనౌన్స్ చేసింది. ఇండియన్ మార్కెట్లో 80 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి కేవలం 50 వేల రూపాయలు బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చని ఫ్లిప్కార్ట్ నమ్మశక్యం కాని డీల్ ని ఈరోజు రివీల్ చేసింది.
SurveySamsung Galaxy S25 డీల్ ప్రైస్ ఏమిటి?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ రూ. 80,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ప్రస్తుతం కూడా ఈ ఫోన్ రూ. 74,999 రూపాయల ధరతో శాంసంగ్ సైట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ని అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 53,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఈ ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అంటే, ఒరిజినల్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే, ఈ ఫోన్ రూ. 23,000 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది.

ఇక సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ పై రూ. 18,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 62,999 రూపాయల ప్రైస్ తో సేల్ చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 4,000 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis అండ్ ఫ్లిప్ కార్ట్ SBI క్రెడి కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందిస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 53,999 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.
Also Read: World Cup 2027 Schedule విడుదల చేసిన ICC .. ఒకే గ్రూప్ లో ఇండియా అండ్ పాకిస్తాన్.!
Samsung Galaxy S25 : ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 5జి స్మార్ట్ ఫోన్ ప్రీమియం గ్రేడ్ ఫోన్ గా మార్కెట్ లో అడుగు పెట్టింది మరియు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు చాలా ప్రీమియం వివరాలు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ రక్షతో చాలా డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది. ఇది కేవలం 7.2mm స్లీక్ డినైన తో ఉంటుంది మరియు IP68 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 4.47GHz క్లాక్ స్పీడ్ కలిగిన ప్రీమియం క్వాల్కమ్ ప్రాసెసర్ Snapdragon 8 Elite తో పని చేస్తుంది . ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో మా మరింత వేగంగా ఉంటుంది.
ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన గొప్ప కెమెరా సిస్టం కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 50MP మెయిన్ + 10MP టెలిఫోటో + 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ మరియు AI కెమెరా ఫీచర్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే, ఈ ఫోన్ లో 6.2 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ఉంటుంది. ఇది 10 బిట్ డిస్ప్లే మరియు విజువల్స్ కోసం ప్రత్యేకమైన ప్రో విజువల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది జబర్దస్త్ విజువల్స్ కూడా అందిస్తుంది.
మొత్తానికి, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ లభించబోయే ధరలో ఇది నిజంగా జబర్దస్త్ డీల్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ డీల్ ను అందుకోవాలంటే ఫ్లిప్ కార్ట్ సేల్ వరకు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ డీల్ పై అందించిన ‘Notify’ బటన్ పై క్లిక్ చేస్తే ఈ ఫోన్ డీల్ లైవ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
