Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్ .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

శాంసంగ్ ఈ రోజు Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు విడుదల చేసింది

ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా భారీ బ్యాటరీ మరియు 50 ఎంపీ కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యాయి

6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ మరియు 6 జనరేషన్ OS అప్‌డేట్స్ కి సపోర్ట్ చేస్తుంది

శాంసంగ్ ఈ రోజు Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ M సిరీస్ మరియు F సిరీస్ నుంచి విడుదల చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా భారీ బ్యాటరీ మరియు 50 ఎంపీ కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యాయి. శాంసంగ్ ఈరోజు సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Samsung Galaxy M08 మరియు F08 : ప్రైస్

ఈ స్మార్ట్ ఫోన్ లను కంపెనీ వెబ్‌సైట్ నుంచి రిలీజ్ చేసిన కంపెనీ ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలను మాత్రమే ఇంకా రివీల్ చేయలేదు. ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు శాంసంగ్ చెబుతోంది. అయితే, ఈ రెండు ఫోన్లు కూడా బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్ వివరాలు కూడా కంపెనీ పూర్తిగా వెల్లడించింది.

Samsung Galaxy M08 : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం 08 మరియు గెలాక్సీ ఎఫ్ 08 రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. అంటే, ఈ రెండు ఫోన్లు కూడా కవల పిల్లల మాదిరిగా ఒకే ఫీచర్స్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 6.74 ఇంచ్ PLS LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లను కూడా మీడియాటెక్ Helio G99+ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 4 జీబీ ర్యామ్ తో పాటు ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ రెండు ఫోన్లలో కూడా 50MP ప్రధాన కెమెరా జతగా 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సెటప్ తో ఈ ఫోన్ గరిష్టంగా FHD వీడియో రికార్డింగ్ వీడియో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లు ఆండ్రాయిడ్ 16 OS తో వస్తాయి మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ మరియు 6 జనరేషన్ OS అప్‌డేట్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లను బ్యాటరీ ప్రత్యేకమైన ఫోన్ లు గా మనం చూడవచ్చు. ఎందుకంటే, శాంసంగ్ ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను కూడా 6000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ని వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్లో అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా 4G LTE ఫోన్స్ అని గమనించాలి.

Also Read: Price Hike: సామాన్యుల జేబుకు చిల్లు .. పెరిగిన టీవీ, Ac, ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మెషిన్ రేట్లు.!

శాంసంగ్ గెలాక్సీ ఎం 08 మరియు గెలాక్సీ ఎఫ్ 08 ప్రైస్ అండ్ సేల్ వివరాలు కూడా త్వరలో రివీల్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. పండుగ సేల్ కంటే ముందే ఈ రెండు ఫోన్లు సేల్ కి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :